దిశ చట్టంపై ఏపీ పోలీసుల సమావేశం
విజయవాడ డిసెంబర్ 17
దిశ చట్టం పై జిల్లా ఎస్పీ లతో డీజీపీ గౌతం సవాంగ్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో అయన మాట్లాడుతూ దిశ చట్టాన్ని మొట్టమొదటి సారిగా తీసుకొచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం మే ఈ చట్టం ఉద్దేశమని అన్నారు. గతంలో కొన్ని నేరాలకు సమయ పరిమితులు ఉన్నాయి. కానీ చరిత్రలో ఇదే మొదటిసారి, కాలపరిమితి ఉందని ప్రజలు తెలుసుకుంటారు. ప్రజల ఆకాంక్షలను పెంచడానికి మేము కట్టుబడి ఉన్నామని అయన అన్నారు. జిల్లా ఎస్పీలు స్పందిస్తూ వేగంగా కేసు దర్యాప్తు జరపడంతో పాటు నిందితులను తక్షణమే అరెస్ట్ చేస్తాం. సాధ్యమైనంత తొందరగా ఫోరెన్సిక్ నివేదిక లు అందేవిధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. రెన్సిక్ నివేదిక తోపాటు DNA రిపోర్టులు తక్షణమే అందేవిధంగా చర్యలు తీసుకుంటాం. నిర్ణీత సమయం లో వయస్సు నిర్ధారణ , పోస్ట్ మార్టం మరియు అన్ని రకాల మెడికల్ రిపోర్ట్స్ అందేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.