YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

మద్యం ధరలు తగ్గించాలి

మద్యం ధరలు తగ్గించాలి

మద్యం ధరలు తగ్గించాలి
హైదరాబాద్ డిసెంబర్ 17
రాష్ట్ర ప్రజలకు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు.  రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్(కేఎస్టీ) అమలవుతోంది. ఏం చేయాలన్నా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందే. మద్యం ధరల పెంపు వెనుక కేఎస్టీ మాఫియా. మద్యం ధరల వ్యవహారంలో ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చాడని  రేవంత్ ఆరోపించారు. ఇది భారీ కుంభకోణం... కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరపాలి. రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ... ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయింది. మద్యాన్ని ప్రోత్సహించడమంటే మహిళల భద్రతలో రాజీ పడటమే. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న యూపీలో కూడా మద్యం ఆదాయం ఇంత లేదు. ఆరు కేసీఆర్ లక్కీ నెంబర్- అందుకే కేఎస్టీ కూడా ఆరు శాతమే. మద్యం అమ్మకాల్లో దోపిడీ కోసమే ప్రభుత్వ గుత్తాధిపత్యం వుంది. కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే ప్రోత్సహిస్తున్నారు. ఉత్పత్తి వ్యయం కంటే వెయ్యి శాతం అధిక ధరలా అని  రేవంత్ ప్రశ్నించారు. ఇంత అధిక ధరలకు అమ్ముతుంటే వినియోగదారుల ఫోరం ఏం చేస్తోంది. లాటరీ జూదం అన్నారు.  అదే లాటరీ విధానంలో షాపులెలా కేటాయిస్తారు. షాపు దక్కని దరఖాస్తు దారుడుకి డబ్బు వాపస్ ఇవ్వకపోవడం నేరమని అన్నారు. జనవరి 30న కట్టాల్సిన రుసుములు ఈ రోజే కట్టాలని షాపులకు తాఖీదులా. పెంచిన ధరలు తక్షణం నిలిపేయాలి. కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించకుంటే  కోర్టును ఆశ్రయిస్తామని  రేవంత్ లేఖలో పేర్కోన్నారు.

Related Posts