YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ వల్ల 15 వేలు నష్టం

జగన్ వల్ల 15 వేలు నష్టం

జగన్ వల్ల 15 వేలు నష్టం
విజయవాడ, డిసెంబర్ 17 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వల్ల ఒక్కో కుటుంబానికి రూ.15వేలు నష్టమంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వల్ల లబ్దిదారులు నష్టపోతున్నారని ఆరోపించారు. లెక్కలతో సహా చెబుతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జనసేనాని. వరు ట్వీట్‌లతో ఘాటుగా విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ వృద్ధాప్య పెన్షన్‌ రూ.2వేలు నుంచి రూ.3 వేలు పెంచుతామని.. వృద్ధాప్య పెన్షన్‌ పొందే అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామన్నారని.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.కొత్త ప్రభుత్వం పెన్షన్‌ రూ.3 వేలు చేయలేదని.. రూ.250 మాత్రమే పెంచి.. రూ.2,250 చేశారని.. ఒక్కే ఫించన్‌ లబ్ధిదారుడు రూ.750 నష్టపోతున్నారని లెక్కలు చెప్పుకొచ్చారు జనసేనాని. ఇటు పెన్షన్‌ పొందే వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తున్నామని మే 30న ఇచ్చిన జీవో 103 ద్వారా చెప్పారన్నారు. ఇలా వయసు తగ్గిస్తే కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్‌ దక్కాలని.. కానీ ఇప్పటి వరకూ ఒక్క కొత్త ఫించన్‌ లబ్దిదారుడికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ.2,250 లెక్కనే చూసుకున్నా కొత్త ఫించన్‌ లబ్దిదారు కుటుంబం ఈ 7 నెలల్లో రూ.15,700 కోల్పోయిందన్నారు. ఓటు వేసినందుకు ఒక్కో కొత్త వృద్ధాప్య ఫించన్‌ లబ్దిదారుడి కుటుంబ౦ ఈ ఏడు నెలల్లో కోల్ఫోయింది అక్షరాలా రూ.15,700 అన్నారు పవన్ కళ్యాణ్. జీవో కాపీని కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Related Posts