YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ దేశీయం

ఢిల్లీకి దిశ నిందితుల డెడ్ బాడీస్

ఢిల్లీకి దిశ నిందితుల డెడ్ బాడీస్

ఢిల్లీకి దిశ నిందితుల డెడ్ బాడీస్
హైద్రాబాద్, డిసెంబర్ 17, 
గత నెలలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతానికి కారణమైనటువంటి నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయారు. అయితే అదే రోజు రాత్రి ఆ నలుగురి మృతదేహాలను ఖననం చేయాలని భావించినప్పటికీ కోర్టు ఆదేశాల కారణంగా అది వీలుపడలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో భద్రపరిచారు. అయితే ఆ తరువాత వాటిని హైదరాబాద్ లోని గాంధీ మార్చురీకి తరలించారు. నిజానికి ఆ మృతదేహాలను ఈనెల 13 వరకే భద్రపరచాలి అని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ కేసు విషయమై సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది.అయితే వాటిని భద్రపరచడానికి మరికొంత సమయం కావాలని ఆదేశాలు వచ్చాయి. అయితే గాంధీ ఆసుపత్రిలో ఆ మృతదేహాలను ఎంత ఫ్రీజింగ్ లో భద్రపరచినప్పటికీ కూడా ఎంతో కొంత సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. చివరికి అవి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక వాటిని భద్రపరచడం తమ వల్ల కాదని గాంధీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఒకవేళ అవి కుళ్ళిపోతే వాటికి రీపోస్టుమార్టం జరపడానికి అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు .ఈమేరకు వాటిని ఢిల్లీకి తరలించడానికి అనుమతిని ఇవ్వాలని గాంధీ ఆసుపత్రి సిబ్బంది తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఢిల్లీ ఎయిమ్స్ లో ఎన్నిరోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. అక్కడ మృతదేహాలను ఎన్ని రోజులు పెట్టినప్పటికీ కూడా వాటికీ ఎలాంటి నష్టం జరగదని గాంధీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.

Related Posts