YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సభనుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్

సభనుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్

సభనుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్
అమరావతి డిసెంబర్ 17 
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవరం నాడు వాడి వేడిగా నడిచింది. సభ నుంచి తొమ్మిదిమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. వారిలో నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, రామకృష్ణ బాబు, సాంబశివరావు, వీరాంజనేయస్వామి, మద్దాలి గిరి, అశోక్, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. రాజధాని భూముల విషయమై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ప్రసంగిస్తుండగా అందులోని పలు అంశాలపై అభ్యంతరాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభకు ఆటంకం కలిగిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభాపతి తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ అసెంబ్లీ నుంచి 9 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏం చెప్పాలో తెలియక చంద్రబాబు పేపర్లు వెతుక్కుంటున్నారన్నారు. ఆయన అయోమయానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ప్రసంగంలో అమరావతిపై అసలే మాట్లాడలేదన్నారు. చివర్లో మీడియాకోసం అమరావతి పేరును ప్రస్తావించారన్నారు. రాజధాని ప్రాంత నిర్ణయంపై శివరామకృష్ణతో కూడిన నిఫుణుల కమిటీ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడమటుంచీ.. కొత్తగా నారాయణ కమిటీ ని వేసుకున్నారని టీడీపీపై మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ మేధావులతో కూడిన కమిటీ గాక, నారాయణ కమిటీ వ్యాపారస్తులతో కూడిన కమిటీ అని బుగ్గన పేర్కొన్నారు. రాజధాని ప్రాంత నిర్ణయంపై ప్రజాభిప్రాయం పేర కేవలం 1400మంది ప్రజల అభిప్రాయాలను ఫోన్ల ద్వారా తీసుకున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో 5కోట్ల మంది ఉంటే కేవలం 1400మంది అభిప్రాయాలను ఎలా తీసుకుంటారని బుగ్గన ప్రశ్నించారు.

Related Posts