YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

భ్రూణ హత్యలు నేరం, ఆడ శిశివులను కాపాడిల్సిన బాధ్యత మనదే  - న్యాయమూర్తి నాగ శైలజ

భ్రూణ హత్యలు నేరం, ఆడ శిశివులను కాపాడిల్సిన బాధ్యత మనదే  - న్యాయమూర్తి నాగ శైలజ

భ్రూణ హత్యలు నేరం, ఆడ శిశివులను కాపాడిల్సిన బాధ్యత మనదే- న్యాయమూర్తి నాగ శైలజ
జిల్లాలో పి. సి. అండ్ పి. ఎన్. డి. టి. చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి - జెసి 2 చంద్రమౌళి
చిత్తూరు, డిసెంబర్ 17
భ్రూణ హత్యలు నేరమని, ఇవి జరగకుండా ప్రభుత్వ మరియు ప్రైవేటు గైనకాలజిస్టులు , రేడియాలజిస్టులు స్కానింగ్ కేంద్రాలు, పి సి పి ఎన్ డి టి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అందరి పై ఉందని సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రెటరీ న్యాయమూర్తి నాగ శైలజ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో గర్భస్థ పిండ లింగనిర్థారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా వైద్య అధికారుల సమావేశంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొనగా, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జే‌సి2 చంద్రమౌళి   ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ పి సి పి ఎన్ డి టి చట్టాన్ని 1994 లో భారత ప్రభుత్వం తీసుకు వచ్చిందని జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదని దానికి నిదర్శనం భ్రూణ హత్యల పై తరచూ వార్తలు రావడమే అని అన్నారు. ఇప్పటికే  బ్రూణ హత్యలు ప్రోత్సహించి ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న వారు ఉన్నారని,  ఇవి జరగకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలో మనపై ఉందని అన్నారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు న్యాయపరంగా  తమ వంతు కృషి చేస్తామని అన్నారు. డాక్టర్ల వృత్తి గౌరవప్రదమైనది, పవిత్రమైనది, కానీ మెడికల్ టెక్నాలజీతో కొంత మంది చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆడ శిశువులను కాపాడుకుందామని అన్నారు.  మగ బిడ్డలతో ఆడబిడ్డలను సమానంగా ఎదగనిద్దాం అని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. బ్రుణ హత్యలు కు సంబంధించిన శిక్షలు గురించి ప్రతి స్కానింగ్ సెంటర్ వారు, డాక్టర్లు  తెలుసుకోవాలని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ కిశోర బాలికలకు ప్రతినెల ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు కల్పించాలని సూచించారు. అలాగే పోలీసులు  బాల్య వివాహాలను జరగకుండా చూడాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో గర్భవతికి ఆరోగ్య పరీక్షల దృష్ట్యా అబార్షన్ చేయవలసి వస్తే అందుకు సంబంధించిన ఫార్మాట్ లో బందువుల అనుమతి, అంగీకారం ఉండాలని చట్టప్రకారమే అబార్షన్ చేపట్టాలని సూచించారు. జె.సి.2 చంద్రమౌళి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగనిర్థారణ నిషేధ చట్టం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు జరిగేలా ప్రతి ఒక్కరూ కృతనిశ్చయంతో పనిచేయాలని అన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా ఎదగనివ్వాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ వారు ప్రత్యేక నిఘా పెట్టాలని, స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో లింగ నిష్పత్తి 1000 మంది బాలురకు 931 గా ఉందని మరీ తక్కువగా ఉన్న  మండలాలను గుర్తించి అక్కడ ఏమైనా చట్ట వ్యతిరేక చర్యలు భ్రూణహత్యలు జరుగుతున్నాయా అని పరిశీలించి చర్యలు చేపట్టాలని, శిక్షలు అమలు చేయాలని సూచించారు. జిల్లాలో ఆడపిల్లలను ఎదగని ఇవ్వాలని కోరారు.  ఈ సమావేశంలో జిల్లా  వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.పెంచలయ్య, డి సి హెచ్ ఎస్ డా.సరళమ్మ, ప్రభుత్వ  ప్రసూతి ఆసుపత్రి సూపర్నెంట్ డా.భారతి, ఐ‌ఎం‌ఏ స్టేట్ ప్రెసిడెంట్ డా.శ్రీహరి, రేడియాలజిస్ట్ డా.రాజారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డా.అరుణ సులోచనాదేవి, డెమో డా.నిర్మలమ్మ, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు, స్కానింగ్ కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts