రాజధాని భూములు కొన్నది వీరే
అమరావతి డిసెంబర్ 17,
రాజధాని బూములు కొన్న టీడీపీ నేతల పేర్లను మంత్రి బుగ్గన మంగళవారం శాసనసభలో చదివి వినిపించారు. బుగ్గన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 4070 ఎకరాలు టిడిపి కి సంబందించిన వారు కొనుగోలు చేశారు. కంటెరు గ్రామం లో హెరిటేజ్ ఫుడ్స్ 14.22 ఎకరాలు భూమి ఇక్కడ కొనుగోలు చేసింది. మాజీ మంత్రి నారాయణ ఆయన బంధువుల పేరు పైన 55.27 ఎకరాలు కొన్నారు. ప్రతిపాటి పుల్లారావు 35.84 ఎకరాలు, పరిటాల సునీత తన అల్లుడు పేరుతో భూమి కొనుగోలు చేశారు. రావెల కిశోర్ బాబు 40.85 ఎకరాలు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ 68.60 ఎకరాలు, జీవీఎస్ ఆంజనేయులు 37.24 ఎకరాలు, పయ్యావుల కేశవ్ 15.30 ఎకరాలు, పల్లె రఘునథరెడ్డి - 7.56 ఎకరాలు, వేమూరు రవి కుమార్ ప్రసాద్ (లోకేష్ బిజినెస్ పార్టనర్) - 25.68 ఎకరాలు, లింగమనేని సంస్థ 351.25 ఎకరాలు, యనమల అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ - 7 ఎకరాలు, కోడెల శివప్రసాదరావు - 17.13 ఎకరాలు, దులిప్పాళ్ళ నరేంద్ర చౌదరి - 13.50 ఎకరాలు కొన్నారని అన్నారు.