YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులు..టీడీపీలో అయోమయం

మూడు రాజధానులు..టీడీపీలో అయోమయం

మూడు రాజధానులు..టీడీపీలో అయోమయం
విజయవాడ, డిసెంబర్ 18
ఏపీకి ఇకపై మూడు రాజధానులు ఉండొచ్చు అన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో మాజీ సిఎం చంద్రబాబు అయోమయంలో పడిపోయారు. శాసనసభలో జగన్ ప్రకటన తరువాత మీడియా ముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. అమరావతిని మూడు భాగాలుగా చేస్తే ప్రపంచం తలక్రిందులైపోతున్నట్లే ఆయన వ్యాఖ్యలు చేశారు. జగన్ ది పిచ్చి తుగ్లక్ పాలన అంటూ చంద్రబాబు చెలరేగిపోయారు. శాసన సభ సమావేశాలకు వచ్చే ఎమ్యెల్యేలు సచివాలయం కోసం విశాఖ, హై కోర్టు కోసం కర్నూలు వెళ్ళి ఇళ్లు కట్టుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పాలన చేస్తారని నిలదీశారు. వైసిపి ప్రభుత్వానికి నామీద కోపమా, అమరావతి మీద ద్వేషమా అంటూ ప్రశ్నించారు. యువత ఉద్యోగాలకు వలస పోక తప్పదన్నారు. జగన్ కి హైదరాబాద్, బెంగుళూర్ లో వున్న ఆస్తుల పెరుగుదల కోసమే ఇదంతా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బూమ్ రాంగ్ అయ్యేలాగే కనిపిస్తున్నాయి.వాస్తవానికి ఐదేళ్లపాటు మాత్రమే శాసనసభ్యుడిగా వుండే వారికి ప్రభుత్వమే నివాసానికి క్వార్ట్రర్స్ ఇస్తుంది. దానితో పాటు వారు ఎక్కడ తిరిగినా ట్రావెల్ అలవెన్స్ లు సర్కార్ చెల్లిస్తుంది. జీతభత్యాలు వీటికి అదనం. ఇక వారు రాజధాని ప్రాంతంలో సొంత నివాసానికి భూములు కొనుగోలు ఎందుకు చేయాలో చంద్రబాబుకే తెలియాలి. ఇక హై కోర్టు అన్నది ప్రతి శాసనసభ్యుడికి అవసరం లేనిదే. నిత్యం లిటిగేషన్స్ సాగించేవారికి తప్ప పనికిరాదు. ప్రతి ఎమ్యెల్యే హై కోర్టు గుమ్మం నిత్యం ఎక్కాలి అన్న తీరులో చంద్రబాబు వ్యాఖ్యలు ధ్వనించాయి. అలాగే సచివాలయానికి నియోజక వర్గ సమస్యల కోసం వెళ్ళాలిసిన పని ఎమ్యెల్యేలకు ఉంటుంది. అక్కడ కూడా ప్రభుత్వ క్వార్ట్రర్స్, అతిధి గృహాలు ఉంటాయి కాబట్టి అది కూడా వారికి పెద్ద సమస్యే కాదు. అసెంబ్లీ సమావేశాల కాలంలో క్వార్ట్రర్స్ , పనులపై సచివాలయానికి వెళ్లేవారికి క్వార్ట్రర్స్ వున్నప్పుడు నాయకులు ఇళ్ళు , స్థలాలు అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా చంద్రబాబు లబోదిబో మంటున్నారని అధికారపక్షం అప్పుడే విమర్శల దాడి మొదలు పెట్టేసింది.చంద్రబాబు అండ్ కో భూ దందా, రియల్ ఎస్టేట్ వ్యవహారం ఆయన చేసిన డొల్ల వ్యాఖ్యల్లోనే తేలిపోయిందంటూ ఆరోపిస్తుంది. యువతకు ఇప్పుడేదో అమరావతిలో అద్భుత అవకాశాలను చంద్రబాబు కల్పించినట్లు మాట్లాడుతున్నారని ఎక్కడ పరిశ్రమలు ఉంటే అక్కడికే ఉద్యోగాలకు వారు వెళతారని చెబుతున్నారు. అమరావతితో పోలిస్తే విశాఖ లోనే వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా వుంటాయని వాదిస్తున్నారు. హైదరాబాద్ లో బెంగళూరు లో జగన్ ఆస్తుల పెరుగుదల కోసమే జగన్ ఇదంతా చేశారని ఆరోపించడాన్ని అధికారపక్షం ఎద్దేవా చేస్తుంది. విశాఖ, కర్నూలు లో జగన్ కి ఆస్తులు ఉన్నాయని అంటే కొంతైనా అర్ధం ఉంటుందని హైదరాబాద్ లో జగన్ కన్నా చంద్రబాబు కే ఆస్తులు అధికమని వైసిపి నేతలు చంద్రబాబు పై సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో చంద్రబాబు కి మైండ్ బ్లాంక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని వైసిపి మొదలు పెట్టేసింది. వీరి ఆరోపణలు, విమర్శలు రాజధానిపై కమిటీ నివేదిక ఆ తరువాత ప్రక్రియ పూర్తి అయ్యేవరకు సాగేలాగే కనిపిస్తున్నాయి.

Related Posts