YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూముల కేటాయింపు పై వచ్చిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం

Highlights

  • 15,550 ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఉద్యోగాలు కల్పించాం
  • ఐటీ లో 16,583 ఉద్యోగాలు కల్పించాం
  • ఇండియా బిపిఓ స్కీం ద్వారా 19,380 ఉద్యోగాలు కల్పించాం
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూముల కేటాయింపు పై వచ్చిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం

అసెంబ్లీ లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూముల కేటాయింపు పై వచ్చిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం 

2014 రాష్ట్ర విభజన సమయానికి 99 శాతం ఐటీ రంగం హైదరాబాద్ లో ఉంది 

అప్పుడు కేవలం కొన్ని చిన్న కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి

ఐటీ రంగంలో అభివృద్ధి సాధించిన హైదరాబాద్, బెంగుళూరు,చెన్నై నగరాలను కాదని ఆంధ్రప్రదేశ్ కు కంపెనీలు రావడానికి అనేక చర్యలు తీసుకున్నాం 

అనేక పాలసీలు తీసుకొచ్చాం,రాయితీలు కల్పిస్తున్నాం

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటుంది

ఇలాంటి సమయంలో లాక్ష ఐటీ ,2 లక్షల ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాను

ఇప్పటికే 15,550 ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఉద్యోగాలు కల్పించాం

ఒక్క ఫాక్స్ కాన్ కంపెనీలోనే 14 వేల మంది మహిళలు పని చేస్తున్నారు

త్వరలోనే తిరుపతి లో రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చెయ్యబోతుంది

ఐటీ లో 16,583 ఉద్యోగాలు కల్పించాం 

ఒప్పందం కుదుర్చుకుని,భూముల కేటాయింపు పూర్తి అయ్యి,పనులు ప్రారంభం అయిన కంపెనీల ద్వారా 27,500 ఉద్యోగాలు రాబోతున్నాయి

మరో 40 వేల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీల తో ఒప్పందం చేసుకున్నాం 

ఇండియా బిపిఓ స్కీం ద్వారా 19,380 ఉద్యోగాలు కల్పించాం

హైదరాబాద్ పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్ గుర్తువస్తుంది

అలాంటి పెద్ద కంపెనీలు తీసుకురావాలి అని అనేక ప్రయత్నాలు చేసి ఫలితం సాధించాం

విశాఖపట్నం కు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్,ఏఎన్ఎస్ఆర్,
కాన్డ్యూయెంట్,గూగుల్ ఎక్స్ లాంటి కంపెనీలు వచ్చాయి

విశాఖలో ఎప్పటి నుండో ఖాళీగా ఉన్న హిల్ 1,2 కు  ఇప్పుడు ఐటీ కంపెనీలు వచ్చాయి 

అమరావతి కి హెచ్సిఎల్ కంపెనీ వచ్చింది,పై డేటా సెంటర్ వచ్చింది 

సుదీర్ఘ కాలం ఖాళీగా ఉన్న మేధా టవర్స్ ఇప్పుడు నిండిపోయింది. ఫేస్ 2 కూడా వేగంగా నిర్మాణం జరుగుతుంది

మంగళగిరిలో పెద్ద ఎత్తున  ఐటీ కంపెనీలు వస్తున్నాయి

మంగళగిరి లో ఐటీ కంపెనీల కోసం 70 ఎకరాలు కేటాయిస్తే అంత ఎందుకు అని విమర్శించారు.

ఇప్పుడు మరిన్ని కంపెనీలు మంగళగిరికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి

తిరుపతికి జోహో కంపెనీ వచ్చింది 

రాష్ట్రంలో సైబరాబాద్ తరహాలో నాలుగు ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం

తిరుపతి,విశాఖపట్నం, అనంతపురం,అమరావతి లో ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చెయ్యబోతున్నాం 

ప్రపంచంలోనే ఉత్తమ ఫింటెక్ హబ్ గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది

ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించేందుకు ఐఐటి పాలసీ రూపొందించాం

అందులో భాగంగా ఫ్రాంక్లిన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది

ముఖ్యమంత్రి గారు,నేను అమెరికాలోని ఫ్రాంక్లిన్ కంపెనీకి వెళ్లి చర్చలు జరిపి,ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చాం

వాక్ టూ వర్క్ పద్దతిలో ఫ్రాంక్లిన్ కంపెనీ ఏర్పాటు కాబోతుంది

455 కోట్ల పెట్టుబడి,2500 ఉద్యోగాలు రాబోతున్నాయి

ఫ్రాంక్లిన్ కంపెనీ కి నిబంధనల ప్రకారం భూముల కేటాయించాం 

సిసిఐటిఐ,బిఏసి,ఎస్ఐపిబి లు ఆమోదం తెలిపిన తరువాత భూముల కేటాయింపులు జరిగాయి

కంపెనీలకు నేరుగా భూముల కేటాయింపు చెయ్యడం లేదు 

ముందు అద్దె భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించిన తరువాతే వారికి భూముల కేటాయింపు చేస్తున్నాం

దొంగ అబ్బాయి,దొంగ పేపర్...12 కేసుల్లో ఏ1 గా ఉన్న వ్యక్తి నా పై ఆరోపణలు చేస్తున్నారు

రాష్ట్రానికి కంపెనీలు రాకుండా,మన యువతి యువకులకు ఉద్యోగాలు రాకుండా చెయ్యాలి అని 
కుట్రపూరితంగా వార్తలు రాస్తున్నారు

దేశంలోనూ, విదేశాల్లోనూ విశ్రాంతి లేకుండా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ముఖ్యమంత్రి ,నేను నిరంతరం కష్టపడుతున్నాం 

వచ్చే కంపెనీలను అడ్డుకోవాలని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

ఆరోపణలు,విమర్శలు చేసే వారికి సవాల్ విసురుతున్నా 

మీకు అయ్యే ఖర్చు నేను బరిస్తాను ఎక్కడికైనా వెళ్లి 
ఒక్క కంపెనీ అయినా తీసుకురాగలరా? 

ఇదే పాలసీలో భూములు కేటాయిస్తాను...21 రోజుల్లో భూములు కేటాయిస్తాను విమర్శలు చేసే వారు ఒక్క కంపెనీ అయినా రాష్ట్రానికి తీసుకురాగలరా?

కంపెనీలు రాకుండా అడ్డుపడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు...

మంత్రి నారా లోకేష్

Related Posts