YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల కోళ్ల పంపిణీకి సిద్ధం

తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల కోళ్ల పంపిణీకి సిద్ధం

తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల కోళ్ల పంపిణీకి సిద్ధం
నిజామాబాద్, డిసెంబర్ 18,
గ్రామాల్లోని పేదలకు నాటుకోళ్లు అందించే కొత్త స్కీమ్ కు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్లాన్ చేస్తోంది. దీని కోసం రూ.163.20 కోట్లు ఖర్చు పెట్టనుంది. 58 లక్షల కుటుంబాలే లక్ష్యంగా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నాటుకోళ్ల పెంపకంతో పేదలకు ఆదాయం సమకూర్చడంతోపాటు రూరల్ ఏరియాల్లో న్యూట్రిషన్ లోపాన్ని అధిగమించవచ్చని అంచనా వేస్తోంది.రూ.163.20 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 2.04 కోట్ల నాటు కోళ్లను పంపిణీ చేయడానికి పశుసంవర్ధక శాఖ ప్లాన్ చేస్తోంది. యూనిట్‌ కు  5 కోళ్లు చొప్పున  ఏటా  40.8 లక్షల కోళ్లను ఐదేళ్ల పాటు పంపిణీ చేయాలని భావిస్తోంది. వీటిలో 60 నుంచి 70 శాతం కోళ్లు సర్వైవ్‌ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ కోళ్లతో  ఏటా  85.68 కోట్ల గుడ్లు, 8.56 మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుందని లెక్కలు వేసింది. గుడ్ల ఉత్పత్తితో రూ.342.72 కోట్లు, కోళ్ల అమ్మకాలతో  రూ.285.60 కోట్లు మొత్తం  రూ.628.32 కోట్ల వరకు అదాయం సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తోంది.వనరాజ, గిరిరాజ, గ్రామరాజ, రాజశ్రీ కోళ్లు ఆత్యంత ఆకర్షణీయమైన లక్షణాలతో రంగుల రెక్కలతో ఉంటాయి. వీటికి అధిక రోగ నిరోధక శక్తి ఉంటుంది. పెద్ద సైజు గుడ్లు పెడుతాయి. పెంపకం ఖర్చు తక్కువ. ఎక్కువ రోజుల వరకు బతుకుతాయి. వీటి గుడ్లు దేశీ కోళ్లు కూడా పొదగడానికి ఉపయోగకరంగా ఉంటాయి.నాటు కోళ్ల పెంపకానికి సబ్సిడీ ఎలా ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  యూనిట్లను 5కే పరిమితం చేసి వందశాతం రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కేంద్రం సహకారంతో చేపట్టిన కోళ్ల పెంపకానికి యూనిట్‌కు 45 పిల్లలను ఇచ్చిన శాఖ ఈ సారి కోళ్లను ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2019–- 20లో 14 వేల యూనిట్ల చిక్స్‌ కు నిధులు విడుదల చేసింది. యూనిట్ ధర రూ.1,700గా నిర్ణయించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.1,250 కాగా.. లబ్ధిదారుల వాటా రూ.450. ఒక యూనిట్‌లో 45 కోడి పిల్లలు ఇచ్చారు. 25, 20 కోడిపిల్లలుగా రెండు విడతల్లోపంపిణీ చేశారు. కోడి పిల్లలకు ఒక్కో దానికి రూ.68 ఉండగా.. రూ.50 సబ్సిడీ పోగా రూ.18 చెల్లిస్తే కోళ్లు ఇచ్చారు. ఈ సారి మాత్రం కోడి పిల్లలను కాకుండా కోళ్లనే రూ.80 చొప్పున కొనుగోలు చేసి వందశాతం సబ్సిడీతో ఇవ్వాలని ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

Related Posts