డ్రైవింగ్ స్కూళ్లల్లో నిబంధనలు హుళ్లుక్కే
నిజామాబాద్, డిసెంబర్ 18,
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా సాంకేతికతను ఉపయోగించుకుంటాం.. ఇందులో బాగంగా నగరంలోని ఆర్టిఏ కేంద్రాల్లోనే కాకుండా, డ్రైవింగ్ స్కూళ్ళలో కూడా కంప్యూటర్ ఆధారిత సిమ్యులేటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆర్టివో ఉన్నతాధికారులు చెప్పిన అధికారులు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. రెండు సంవత్సరాల సుమారు సంవత్సరం క్రితం ఆర్టివో కార్యాలయంలో మాత్రమే దీన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. నగరంలో 40కు పైగా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి.ఇందులో సగానికి పైగా స్కూల్స్‌కు అనుమతి లేక పోగా ఉన్న వాటిలో సరైన సౌకర్యాలు లేక పోవడం గమనార్హ ం. డ్రైవింగ్ స్కూల్ ఉండాలంటే కనీసం రెండు కండిషన్ వాహనాలతో పాటు డ్రైవింగ్‌ల కనీసం 5 సంవత్సరాల అనుభవంతో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నశిక్షకుడిని ఏర్పాటు చేయాలి. కానీ సగం డ్రైవింగ్ స్కూళ్ళలో సరైన శిక్షకులు లేరు. సరైన వసుతులు లేకుండా శిక్షణ ఇవ్వడంతో వారు తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి.నగరంలో ఉన్న డ్రైవింగ్ స్కూల్స్‌లో సగం దొంగచాటుగా కొనసాగుతుంటే, అనుమతులు ఉన్న వాటిలో సరైన సౌకర్యాలు,నైపుణ్యం కలిగిన శిక్షకులు లేక పోవడంతో సాధారణంగా మారింది కోటికి పైగా జనాభా ఉన్న ఈ మహానగరంలో వందకు పైగా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నప్పటికి ఒక్క మారుతీ షోరూం డ్రైవింగ్ స్కూల్‌తో పాటు ఒకటి రెండు స్కూల్స్‌లో మినహ మిగతా వాటిలో ఎక్కడా డ్రైవింగ్ సిమ్యులేటర్ లేక పోవడం గమనార్హ ంసిమ్యులేటర్లతో వాహన దారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటి ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా డ్రైవింగ్‌లో నైపుణ్యం కూడా సంపాదించు కోవచ్చు. అంతే కాకుండా ఏదో నామమాత్రంగా డ్రైవింగ్ నేర్చుకుని రోడ్డు మీదకు వచ్చే వారికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. డ్రైవర్లలో కొంత మంది నిరక్షరాస్యులు లాంటి వారికి వాహన రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక అవగాహన ఉండటం లేదు. వాహనాల్లో డీజిల్ మీటర్లు, గేర్ స్టిస్టం లేని సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సిమ్యులేటర్లో సెంటర్‌లలో వీటిపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తారు.ఇది వరకు ట్రాఫిక్ సిగ్నల్న్‌లో రెడ్, గ్రీన్, ఎల్లో సిగ్నల్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు నంబర్ సిస్టం వచ్చింది. వాటిపై కూడాఅవగాహన కల్పిస్తారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై పక్కన ఉండే సైన్ బోర్డులు తెలుగు, ఆంగ్లం, ఊర్దు భాషల్లో గ్రామాలు, పట్టణాలు పేర్లు ఉంటాయి. ఇవి ఇతర రాష్ట్రాల్లో డైవర్లకు అర్థం కావు. ఈ విషయంలో డ్రైవర్లకు కనీస పరిజానాన్ని పెంపొందిస్తారు. రహాదారి విస్తరణకు అనుగుణంగా వాహన వేగం ఎంత ఉండాలి ? రోడ్డు పరిస్థితులను ఏ విధంగా అంచనా వేయాలి. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు డ్రైవింగ్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విషయాలపై అవగాన కల్పిస్తారు.