YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి రైతుల అందోళన

అమరావతి రైతుల అందోళన

అమరావతి రైతుల అందోళన
అమరావతి  డిసెంబర్ 18,
గుంటూరు జిల్లా తుళ్లూరు లో రైతులు అందోళనకు దిగారు. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ మందడంలో నిరసన వ్యక్తం చేసారు. పరిపాలన మొత్తం ఇక్కడి నుండి కొనసాగాలని నినాదాలు చేసారు. రాజధాని పై సీఎం వైఎస్ జగన్ ప్రకటన ను వ్యతిరేకించారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని మరువొద్దు.  అమరావతి నుండి పరిపాలన సాగించాలి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దు. తుళ్ళూరులో ముఖ్యమంత్రి వైఖరి నశించాలి అని నినాదాలు చేపట్టారు. కులాల, ప్రాంతాల మద్యల విద్వేషాలు పెంచవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శంచారు. పార్టీలకి అతీతంగా రైతులు, రైతు కూలీలు  ధర్నాలో పాల్గొన్నారు.  మూడు రాజధానుల ప్రకటనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేసారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేసారు. అందోళన కార్యక్రమంతో ట్రాఫిక్ స్థంభించింది. విజయవాడ –అమరావతి,  గుంటూరు నుండి తుళ్లూరు మధ్య,  మంగళగిరి తుళ్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. 

Related Posts