YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 సీఏఏ చట్టం కేంద్రానికి ఊరట

 సీఏఏ చట్టం కేంద్రానికి ఊరట

 సీఏఏ చట్టం కేంద్రానికి ఊరట
న్యూఢిల్లీ, డిసెంబర్ 18  
పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు.. కేంద్రానికి నోటిసులు ఇచ్చింది. కానీ నూతన చట్టం అమలు కాకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జనవరి రెండో వారంలో కేంద్రం తన స్పందనను వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ.. మొత్తం 59 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జనవరి 22న విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ ఎస్ఏ అబోడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ స్పష్టం చేసింది.నూతన చట్టంలోని నిబంధనలపై బోలెడంత గందరగోళం నెలకొందన్న పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ అభిప్రాయాన్ని సుప్రీం అంగీకరించింది. ఆడియో విజువల్ ద్వారా పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను విస్తృతంగా సర్క్యులేట్ చేశారా? అని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను సుప్రీం ప్రశ్నించింది. ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు.ఈ కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఒకేసారి వాదనలు వినిపించడం ప్రారంభించగా.. ఏజీ జోక్యం చేసుకున్నారు. కోర్టులో ఒకే సమయంలో కేవలం ఒకే లాయర్ వాదనలు వినిపించాలన్నారు. భారత సుప్రీం కోర్టు పాకిస్థాన్ సుప్రీం కోర్టును అనుకరిస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలతో కోర్టుకు హాజరైన వారంతా నవ్వేశారు.

Related Posts