YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

దేవికారాణికి అమరావతిలో 9 ప్లాట్లు

దేవికారాణికి అమరావతిలో 9 ప్లాట్లు

దేవికారాణికి అమరావతిలో 9 ప్లాట్లు
హైద్రాబాద్, డిసెంబర్ 18  
ఈఎస్‌ఐ స్కామ్‌లో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కోటిగా బయటపడుతోంది. తెలంగాణలో మాత్రమే కాదు ఆమెకు ఆంధ్రాలో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అమరావతితో పాటూ తిరుపతిలో కుటంబ సభ్యుల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.100కోట్లు ఆస్తులు గుర్తించగా.. ఆ చిట్టా ఇంకా పెరిగిపోతోంది.దేవికారాణి రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో తన పిల్లల పేరిట 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే అల్లుడి పేరు మీద తిరుపతిలో 700 గజాల్లో జీ ప్లస్‌ ఫోర్‌ అపార్ట్‌మెంట్‌ ఉన్నట్లు తేల్చారు. రావిరాల హౌసింగ్‌ బోర్డులో ఒక ఇంటికి రూ.25 లక్షలు అడ్వాన్స్ చెల్లించినట్లు గుర్తించారు. ఇంకా ఏవైనా ఆస్తులు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ స్కామ్‌కు సంబంధించి దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తితోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 19 మంది ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు. ఏసీబీ సెప్టెంబరులో కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కూడబెట్టిన ఆస్తుల చిట్టాపై ఆరా తీస్తున్ననారు. ఏపీలో కూడా ఆస్తులు బయటపడటం ఆసక్తికరంగా మారింది.ఏసీబీ తనిఖీల్లో కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, బ్యాంకులు, బీమా సంస్థల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను గుర్తించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.35 లక్షల విలువైన 9 ఎఫ్‌డీలు, ఎస్బీఐలో 12 ఎఫ్‌డీలను ఏసీబీ గుర్తించింది. ఇటు ఇన్స్యూరెన్స్ సంస్థల్లోనూ ఎఫ్‌డీ చేసినట్లు తేల్చారు. ఏసీబీ అధికారులు ఆ లెక్కల్ని కూడా బయటకు తీసే పనిలో ఉన్నారు.

Related Posts