YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

భావితరాలకు ఆరోగ్యవంతమైప వాతావరణాన్ని అందించాలి

భావితరాలకు ఆరోగ్యవంతమైప వాతావరణాన్ని అందించాలి

భావితరాలకు ఆరోగ్యవంతమైప వాతావరణాన్ని అందించాలి
హైదరాబాద్ డిసెంబర్ 18  
కృష్ణ - గోదావరి నదీ పరివాహక ప్రాంత పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన సన్నాహక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ  ఆరోగ్యవంతమయిన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి.  ఊష్ణోగ్రతలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి.  నీళ్లు లభ్యత తరిగిపోతుంది.  వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయని అన్నారు.  వీటి గురించి మాట్లాడకుండా ఇంకా దేనికోసమో మనం కొట్లాడుతున్నాం.  ప్రజలకు అవసరమయిన వాటిని వదిలేసి మన దేశ రాజకీయాలు ఇంకో వైపు వెళ్తున్నాయి.  ప్లాస్టిక్ పెరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.  పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తల పదేళ్ల ఆందోళనల ఫలితమే గంగా శుద్ధి నిర్ణయమని అన్నారు.  ఇప్పుడు గోదావరి , కృష్ణానది పరివాహక ప్రాంతాల పరిరక్షణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.  నదులు నిరంతరం ప్రవహిస్తూ ఉండాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన ఇప్పటికైనా వచ్చింది.  కృష్ణ - గోదావరి జలాలు సీవేజ్ తో కలుషితం అవుతున్నాయి.  నదిలోకి చేరే నీటిని శుభ్రపరచాల్సిన అవసరం ఉంది.  నదులకు ఐదు కిలోమీటర్ల దూరం నుండి రైతుల పొలాలలో నీడనిచ్చే చెట్లు, ఉద్యాన పంటలు వంటివి వేయాలి.  వాగులకు 2 కిలోమీటర్ల పరిధిలో భారీ ఎత్తున పచ్చదనాన్ని పెంచాలని అన్నారు.  ఇరిగేషన్, ఉద్యాన, రూరల్ డెవలప్ మెంట్, వ్యవసాయ శాఖలు ఈ విషయంలో సంయుక్తంగా పనిచేస్తే ఉత్తమ ఫలితాలు వస్తా.  1465 కిలోమీటర్ల పరిధిలో కృష్ణానది పరివాహక పరిధి ఉంది.  కృష్ణ - గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా 25 లక్షల ఎకరాల భూమిలో పచ్చదనం వెల్లివిరుస్తుంది.  అగ్రో ఫారెస్ట్రీకి తోడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తెలంగాణ ముఖచిత్రం ఉజ్వలంగా ఉంటుంది.  అన్ని శాఖలు ఈ విషయంలో సమిష్టిగా కృషిచేయాలి.  అన్ని గ్రామాలు, పట్టణాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతో పాటు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్  దృష్టిలో ఉందని అన్నారు.  ఉద్యోగులుగానే కాకుండా పౌరులుగా మనం ఈ విషయంలో బాధ్యతగా పనిచేయాలి.  ఇది మానవాళి భవిష్యత్ కు సంబంధించిన అంశం .  మనం మన పిల్లల కోసం ఎన్ని ఆస్తులు కూడబెట్టినా ఆరోగ్యాన్ని కొనివ్వలేం. ఈ సమావేశంలో ఇండియన్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ సంచాలకులు జయప్రసాద్,  శాస్త్రవేత్త డీఆర్ఎస్ రెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నత మరియు వివిధ జిల్లాల అధికారులు పాల్గోన్నారు.

Related Posts