YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

గొల్లమండపాన్ని పరిశీలించిన యాదవ సంఘాలు తిరుమల

గొల్లమండపాన్ని పరిశీలించిన యాదవ సంఘాలు తిరుమల

గొల్లమండపాన్ని పరిశీలించిన యాదవ సంఘాలు
తిరుమల డిసెంబర్ 18,
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్న గొల్ల మండపాన్ని జాతీయ,రాష్ట్ర యాదవ సంఘం నేతలు  పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ సన్నిది గొల్లమండపం యాదవులు చరిత్రపై కుట్ర జరుగుతుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అన్న రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.గతంలో టిటిడి వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చి వేరే ప్రాంతంలో నిర్మిస్తామని ప్రకటించి నేటికి ఆ ఉసు లేదన్నారు.గొల్ల మండపాన్ని తొలిగిస్తాం అనడం హిందు,యాదవులు మనోభావాలకు సంబంధించిన విషయమని టీటీడీ దీనిని ఉపసంహరించాలని విజ్ణప్తి చేశారు.చరిత్ర కలిగివున్న గొల్ల మండపాన్ని తొలగిస్తాం అని అనడం అధికారుల అమాయకత్వమో లేక మూర్ఖత్వమో తెలియడం లేదన్నారు.గుడి,గుడిఆనవాలు మీద పగుళ్లు ఏర్పడితే ఇలాగే కూల్చే దమ్ము ప్రభుత్వానికి, అధికారులకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.గొల్ల మండపాన్ని కూల్చే దిశగా టీటీడీ ,ప్రభుత్వం అడుగులు వెయ్యడం మంచిది కాదన్నారు. గొల్ల మండపానికి హాని కలిగిస్తే దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలను కలుపుకొని 25లక్షల మందితో తిరుపతి మొత్తాన్ని దిగ్బంధం చేసేలా వంటవార్పు పేరుతో గొల్లమండపం బ్యాడ్జితో దీక్షకు దిగుతామని హెచ్చరించారు.తిరుమలలో ఉన్న యాదవులు చిహ్నాన్ని తుడిచేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొల్లమండపం తొలగించే ప్రక్రియపై టీటీడీ పాలక మండలిలో ఓ స్పష్టతకు రావాలని అన్నా రామచంద్ర యాదవ్ అన్నారు

Related Posts