YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గిరిజనులకు అండగా నిలిచిన సీఎం జగన్

గిరిజనులకు అండగా నిలిచిన సీఎం జగన్

గిరిజనులకు అండగా నిలిచిన సీఎం జగన్
గిరిజనులకు ఎస్టి కమిషన్ తో పూర్తి హక్కు కల్పించినందుకు సీఎం కు అభినందనలు
గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్
 నంద్యాల డిసెంబర్ 18,
ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరువేరుగాఎస్టీ కమిషన్ గిరిజనులకు పూర్తి హక్కు కల్పించేందుకు అసెంబ్లీలో ప్రస్తావించి చట్టసభలో ఆమోదించిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గిరిజన ప్రజా సమాఖ్య సంఘం నాయకులు రాజు నాయక్ అభినందనలు తెలిపారు.నంద్యాల పట్టణంలోని స్థానిక గిరిజన ప్రజా సమైక్య కార్యాలయంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు గిరిజనుల బ్రతుకులు ఎప్పుడు మారుతాయి అని ఎదురు చూస్తున్న తరుణంలో శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ఎస్టీ కమిషన్ సపరేట్ గా  ఏర్పాటు చేసి గిరిజనులకు పూర్తి హక్కులను ఏపీ సీఎం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం సాహసోపేత నిర్ణయం అని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడంవల్ల రాష్ట్రంలో 40 లక్షల మంది గిరిజనులు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అడవుల్లో. తండాలలో జీవనం సాగిస్తూ నివసిస్తున్న గిరిజనులకు నేనున్నానంటూ రక్షకుడిగా అండగా నిలబడేందుకు ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల పూర్తి హక్కును అసెంబ్లీలో ఆమోదించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.2003లో గత ప్రభుత్వం ఎస్టిలను ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని తూతూమంత్రంగా సవరణ చేసి అమాయక గిరిజనులకు నమ్మించి నట్లు ప్రకటనలు గత ప్రభుత్వం చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో గిరిజనులకు ఇటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎద్దేవా చేశారు. ఎస్టి కమిషన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన గిరిజనులకు రావాల్సిన హక్కులపై ఉద్యమాలు చేస్తే అప్పటి ప్రభుత్వం గిరిజన నాయకుల పై అక్రమ కేసులు పెట్టి పిడియాక్ట్ నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి అని గుర్తుతెచ్చారు.గిరిజనులు ఆర్థిక. సామాజిక. రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఎస్టీ కమిషన్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ తో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులు రుణపడి ఉంటారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి నాయక్. సహాయ కార్యదర్శి రవి నాయక్. జిల్లా అధ్యక్షులు బాలునాయక్. గౌరవ అధ్యక్షులు కృష్ణా నాయక్. మల్లేష్ నాయక్. జి వి ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర నాయక్ లు  తదితరులు పాల్గొన్నారు.

Related Posts