YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రైతు భరోసా కేంద్రాలపై సీఎం సమీక్ష

రైతు భరోసా కేంద్రాలపై సీఎం సమీక్ష

రైతు భరోసా కేంద్రాలపై సీఎం సమీక్ష
అమరావతి  డిసెంబర్ 18,
క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాలపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, అధికారులు హాజరు హజరయ్యారు. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విత్తనాల తయరీదారులు కూడా నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాత రైతు భరోసా కేంద్రాలకు పంపించాలి. విత్తనాలు నిల్వచేసే గోడౌన్లలోకూడా నాణ్యత పరీక్షలు చేయాలి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న పరీక్ష కేంద్రాల్లోకూడా పరీక్షలు చేయాలని అన్నారు. ఆక్వాఫీడ్ నాణ్యతపై ఎలాంటి నియంత్రణ లేదన్న అధికారులు, ఆక్వాఫీడ్ నాణ్యతపై ప్రమాణాలు నిర్దేశిస్తూ త్వరలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు మాత్రమే తమ విత్తనాలను, పురుగు మందులను, ఎరువులను విక్రయించే దిశగా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల కల్తీకి చెక్ పడుతుంది. ప్రస్తుతమున్న ల్యాబ్లను ప్రభుత్వం పెంచుతున్నందున కల్తీని అడ్డుకునే పనులు ముమ్మరంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం అంటే అవినీతి ఉంటుందని, తక్కువ నాణ్యత ఉన్నవాటిని ఇస్తారని ఒక అభిప్రాయం ఉంది. దీన్ని ఇప్పుడు మార్చబోతున్నాం. అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. అంతేకాక రైతులకు ఇచ్చే విత్తనాలు, పురుగుమందుల్లో నాణ్యత ఉండేలా గట్టిగా వ్యవహరిస్తాం. దీనివల్ల రైతుల్లో  పూర్తి భరోసా ఉంటుంది. గోడౌన్లలో ఉన్నప్పుడు విత్తనాలు కల్తీ జరక్కుండా సరైన నిల్వ పద్ధతులు పాటించాలని సూచించారు. కల్తీ జరగని విధంగా సంచుల నాణ్యత ఉండాలని సీఎం ఆదేశించారు. పంటలకు బీమా సదుపాయం  కూడా రైతు భరోసా కేంద్రాలనుంచే అందించాలి. వివిధ వ్యవసాయ ఉత్పత్తలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాల జాబితా రైతు భరోసా కేంద్రంలో డిస్ప్లే చేయాలి. పంటలు, సాగు విధానాలపై డిజిటల్ సమాచారాన్ని రైతు భరోసా కేంద్రంలో ఉంచాలి. అలాగే వెదర్ స్టేషన్స్కూడా రైతు భరోసా కేంద్రంలో పెట్టాలి. వాతావరణ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలని  సీఎం ఆదేశించారు. 

Related Posts