సెంచరీలతో శతక్కొట్టిన ఓపెనర్లు
విశాఖపట్టణం, డిసెంబర్ 18,
వెస్టిండీస్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ సాధించి.. ఆ వెంటనే వికెట్ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసఫ్ బౌలింగ్‌లో చూడచక్కని బౌండరీ బాదిన కేఎల్ రాహుల్ 102 బంతుల్లో 8x4, 3x6 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కానీ.. అదే ఓవర్‌లో పేలవ షాట్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో.. 227 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్డే కెరీర్‌లో కేఎల్ రాహుల్‌కి ఇది మూడో శతకం.చెపాక్ వన్డేలో 6 పరుగులకే ఔటైన కేఎల్ రాహుల్.. రెండో వన్డేలో దూకుడుగా ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా కేఎల్ రాహుల్ మాత్రం కళ్లు చెదిరే షాట్స్‌తో భారత్ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో హోల్డర్ బౌలింగ్‌లో అతను కొట్టిన అప్పర్ కట్ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్న కేఎల్ రాహుల్.. ఆ తర్వాత రోహిత్ శర్మ జోరు పెంచడంతో కాస్త నెమ్మదించాడు.వెస్టిండీస్ బౌలర్లని ఉతికారేసిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జోడీ.. తొలి వికెట్‌కి 37 ఓవర్లలో ఏకంగా 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 55/0తో భారత్‌కి శుభారంభమిచ్చిన ఈ జోడీ.. ఆ తర్వాత గేర్ మారుస్తూ స్కోరు బోర్డుని పరుగులెత్తించింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటంతో కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా అవకాశం దక్కగా.. సెంచరీతో ఆ స్థానాన్ని అతను సుస్థిరం చేసుకున్నాడు.