క్షమాభిక్ష అవకాశం లేదు : తేల్చి చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ, డిసెంబర్ 18
నిర్భయ హత్యాచారం కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. దోషికి సమీక్ష కోరే హక్కులేదని, అతడి పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. త్వరలో నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నట్టు స్పష్టం చేసింది. దోషులపై ఎలాంటి దయ అక్కర్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ధర్మాసనం తీర్పుపై దోషి తరఫున లాయర్ స్పందిస్తూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని తన వాదనల సందర్భంగా కోర్టుకు వివరించాడు.చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే మంగళవారం ఈ పిటిషన్ విచారించే ధర్మాసనం నుంచి తప్పుకోవడంతో జస్టిస్ భానుమతిని ఆయన స్థానంలో నియమించారారు. మంగళవారమే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉండగా జస్టిస్ బాబ్డే తప్పుకున్నారు. ఈ పిటిషన్‌పై నిర్భయ తరఫున బాబ్డే కోడలు వాదించడంతో ఆయన ధర్మాసనం నుంచి తప్పుకుని తాను తీర్పును వెలువరించలేనని స్పష్టం చేశారు. విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి బాబ్డే కుటుంబంలోని ఒకరు నిర్భయ తల్లి తరపున వాదనలు వినిపించారు.2012 నాటి నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఉరి శిక్ష విధిస్తూ.. 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని అక్షయ్ సింగ్ తన పిటిషన్‌లో కోరాడు. ఈ కేసులో మిగతా ముగ్గురు దోషులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. 2018 జులై 9న సర్వోన్నత న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం, జల కాలుష్యం కారణంగా ఎలాగో నా ఆయుష్షు తగ్గిపోతోంది. కాబట్టి తనకు మరణశిక్ష విధించొద్దని అక్షయ్ సుప్రీం కోర్టును కోరడం గమనార్హం.