YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 వేగం వల్లే ప్రమాదం

 వేగం వల్లే ప్రమాదం

 వేగం వల్లే ప్రమాదం
హైద్రాబాద్, డిసెంబర్ 18, 
:బయోడైవర్సిటీ వంతెనపై జరిగిన ప్రమాదాల నేపథ్యంలో నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని జీహెచ్‌ఎంసీ నియమించిన విషయం తెలిసిందే. వంతెన ప్రమాదంపై నిపుణుల కమిటీ రిపోర్ట్‌ ఇచ్చిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఇవాళ మీడియా సమావేశంలో కమిషనర్‌ కమిటీ నివేదికపై మాట్లాడారు.'నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని కమిటీ పేర్కొంది. వేగ పరిమితి సూచికలు ఏర్పాటు చేయాలని సూచించింది. గంటకు 40కిమీ వేగంతో వెళ్లేందుకు వంతెనను నిర్మించారు. కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వ అనుమతి రాగానే వంతెన తిరిగి ప్రారంభిస్తాం' అని కమిషనర్‌ వివరించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై హైస్పీడ్‌తో వాహనాలు నడిపిన 540 వాహనాలకు పెనాల్టీలు విధించామని, ఇకనుంచి కూడా పెనాల్టీలు కొనసాగుతాయని తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిందని, ఫ్లై ఓవర్‌ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని నిపుణులు తమ నివేదికలో తేల్చారని వివరించారు. హైస్పీడ్ కారణంగానే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల  ప్రమాదం జరిగిందని నిపుణులు నిర్ధారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరమైతే శని, ఆదివారాల్లో ఈ ఫ్లైఓవర్‌ను పోలీసులతో చర్చించి మూసివేస్తామని తెలిపారు.ఇటీవల వంతెనపై నుంచి అతి వేగంగా ప్రయాణించిన కారు కిందపడటంతో రోడ్డుపై ఉన్న ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే

Related Posts