హక్కుల సాధనకు కార్మిక సంఘాలు ముండుండాలి: జగదీష్ రెడ్డి
సూర్యాపేట డిసెంబర్ 18
కార్మిక సంఘాలలో రాజకీయాల ప్రమేయం ఉండకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజకీయాలను కార్మిక సంఘాలతో జొప్పించడంతో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు దెబ్బతిన్నాయన్నారు. ఇవాళ సూర్యపేట జిల్లా కేంద్రంలో 1104 విద్యుత్ ఉద్యోగుల నూతన సంఘ కార్యాలయ భవనాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..హక్కుల సాధనకు కార్మిక సంఘాలు ముందున్నప్పుడే ఆ సంస్థలు పురోగతిలో ఉంటాయని అన్నారు. అటువంటి పురోగతిలో ఉన్న సంస్థనే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్థలని ఆయన కొనియాడారు. యజమానులకు ఆర్థిక క్రమశిక్షణ, కార్మికులకు పనిలో క్రమశిక్షణ ఉండాలని ఆయన ఉపదేశించారు. అటువంటి యాజమాన్యం అదే పద్దతిలో కార్మికులు ఉన్నందునే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో అద్భుత ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. మంచి ఫలితాల ఆవిష్కరణలో ట్రాన్స్ కో &జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు చేసిన కృషి చాలా ఉందన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో జరిగిన రెండవ నియామకమే ప్రభాకర్ రావుదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి ప్రభాకర్ నియామకం ఒక నిదర్శనమన్నారు.వ్యవసాయం పట్ల తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న దార్శనికత కు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాకు అద్దం పడుతుందన్నారు. 2001లో మొదలైన తెలంగాణ ఉద్యమం విద్యుత్ రంగం చుట్టే తిరిగితే 2004 ఎన్నికలలో జరిగిన అధికార మార్పిడికి విద్యుత్ సంక్షోభం కేంద్రంగా నిలిచిందన్నారు. అదే విదంగా కేంద్రం ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు కూడా కుట్రలు కుతంత్రాలు విద్యుత్ రంగం చుట్టే తిరిగాయన్న విషయం విస్మరించరాదన్నారు. అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి 2014 ఎన్నికల హామిలో చెప్పిన విధంగా నిరంతర విద్యుత్ ను మూడేండ్లలో అందించిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు. అటువంటి సంస్ట పురోగతిలో యాజమాన్యాలతో పాటు సిబ్బంది పాత్ర కీలకంగా ఉందన్నారు. అదే సమయంలో విద్యుత్ ప్రమాదాలను నివారించడంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణాలు విలువైనవి అని తిరిగి తేలేని ప్రాణాలు కాపాడడం విద్యుత్ సిబ్బంది కొంచెం జాగురుకతో వ్యహరిస్తే ప్రమాదాలను నివారించడం కష్ట సాధ్యం కాదన్నారు.ఈ కార్యక్రమంలో 1104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ, అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి, నాయకులు కలువల సత్యనారాయణ రావు సూర్యపేట జిల్లా 1104 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్ వెంకన్న, ఇతర సభ్యులు సుధీర్, ఆర్.జనార్దన్ ,శంకర్, పాల్ రాజు, రవికాంత్ శర్మ, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.