YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

బిజెపి దళిత ద్రోహి పార్టీ  కేంద్ర సహాయక హోం మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించాలి

బిజెపి దళిత ద్రోహి పార్టీ  కేంద్ర సహాయక హోం మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించాలి

బిజెపి దళిత ద్రోహి పార్టీ 
కేంద్ర సహాయక హోం మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించాలి
 ఎస్సీ వర్గీకరణ వద్దు రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దాం
జగిత్యాల డిసెంబర్ 18 (న్యూస్ పల్స్)
ఎస్సీ వర్గీకరణ వద్దు రాజధాని రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తామని  తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రాంమౌర్తి  అన్నారు. బుధవారం తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ హాలో మాల చలో ఢిల్లీ మాలల నిరసన మొదటి రోజు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రాంమౌర్తి  హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభద్రతా భావంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల కంటే మనుషులను హీనంగా చూస్తున్నారన్నారు. భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానమైన విద్యా , వైద్య ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్  దవాఖానలుప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళితులను ఉచకోతకోసి మనువాదాన్ని ముందుకు తీసుక వస్తున్న బిజెపి దళిత ద్రోహి పార్టీగా అభివర్ణించారు. కేంద్ర సహాయక మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం విరమింపు చేసుకోవాలని హెచ్చరించారు. మంత్రి పదవిని ప్రమాణ స్వీకారం చేసిన రోజు దేశంలోని ప్రజలు అందరూ సమానమే అని ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి మాదిగలకు మద్దతు పలకడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే  బలపడుతున్న బిజెపి మాలలను అవమానపరిస్తే  భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగంలో దళితులను విడదీయరాదని 341 ఆర్టికల్ ఏర్పాటు చేసిన సంగతి కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పదవి నుండి కిషన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. మాల మాదిగలు మిగతా షెడ్యూలు కులాలు ఎస్సీ వర్గీకరణ వదిలి రాజ్యాధికారం కొరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన మంద కృష్ణ మాదిగ అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగి 25 సంవత్సరాల కాలం రాజ్యాధికారాన్ని దూరం చేశాడన్నారు. మందకృష్ణ మాదిగ మాలలను శత్రువులుగా చూస్తూ మాలలకు బిడ్డను ఇవ్వడం వెనుక అంతర్యంఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజ భద్రయ్య ,జిల్లా అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్, జగిత్యాల కలమంద శేఖర్, నాగర్ కర్నూల్ రాజమల్ల సుకుమార్,ములుగు కావలి రమేష్,మహబూబ్ నగర్ మగ్గడి దీపక్,నీరటి గంగాధర్,చింత కుంట్ల గంగాధర్, శీను నిమ్మగడ్డ ప్రవీణ్ ,నందకిషోర్, లక్ష్మీనరసయ్య,హన్మంతు , సంజీవ్, నర్ర రాజు నరేందర్, పందిరాజు శ్రీనివాస్, 

Related Posts