YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో రెండు వేల ఎకరాలు సిద్ధం

విశాఖలో రెండు వేల ఎకరాలు సిద్ధం

విశాఖలో రెండు వేల ఎకరాలు సిద్ధం
విశాఖపట్టణం, డిసెంబర్ 19,
విశాఖను పాలనాపరమైన రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనలు జగన్ ప్రభుత్వం ముందు చాలా కాలంగా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు. విశాఖ వంటి మహానగరాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని వైసీపీ సర్కార్ మొదటి నుంచి ఆలోచన చేస్తోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అందుకోసం తెరవెనక తతంగం చాలా జరిగినట్లుగా కూడా చెబుతున్నారు. విశాఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇప్పటికి పాతిక లక్షలకు పైగా జనాభా ఉంది. దానికి తోడు పాలనాపరమైన రాజధానిగా మారిస్తే విశాఖ ప్రగతి ఎక్కడికో వెళ్ళిపోతుందని అంటున్నారు.ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా విశాఖలో ప్రభుత్వ భూములను కూడా పెద్ద ఎత్తున గుర్తించారని అంటున్నారు. సుమారు రెండు వేల ఎకరాలను విశాఖ శివారు ప్రాంతాల్లో గుర్తించినట్లుగా చెబుతున్నారు. వాటిలో రాజధాని అభివృధ్ధి చేయాలన్నది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో వేల ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించి ఉన్నాయి. అటవీ భూములు కూడా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఉపయోగించుకుంటే చక్కని రాజధాని తయారవుతుందని గతంలోనే మేధావులు ప్రతిపాదించారు. ఇపుడు వైసీపీ సర్కార్ రెండు వేల ఎకరాలు సేకరించి సిధ్ధం చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దానికి అనుగుణంగానే జగన్ అసెంబ్లీలో కొత్త రాజధాని ప్రకటన చేశారని అంటున్నారు.విశాఖలో సెక్రటరియేట్ ఏర్పాటు చేస్తే రోడ్డు, రైలు కనెక్టివిటీ కూడా పెంచాలన్నది కూడా ప్రభుత్వం వద్ద ఉందని చెబుతున్నారు. అందులో భాగంగానే మెట్రో రైలు ప్రతిపాదన కూడా ముందుకు వచ్చిందని చెబుతున్నారు. విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్ట్ అన్నది 2008లో చేశారు. అది వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడే చేశారు. అయితే తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ దీన్ని కనీసం ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇపుడు జగన్ సర్కార్ మాత్రం ఆరు నెలల కాలంలోనే మెట్రో ఫైళ్ల బూజు దులిపింది. దాంతో విశాఖ వాసులు సంబరపడ్డారు. అయితే దాని వెనక రాజధాని ఏర్పాటు ప్రతిపాదన ఉందని తెలియడంతో మరింతగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ అన్నది ఇప్పటికైతే శివారు ప్రాంతాల వరకే పరిమితంగా ఉంది. రానున్న రోజులలో మూడు జిల్లాలకు కూడా విస్తరించాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రమం వస్తున్న నేపధ్యంలో అటు విజయనగరం జిల్లాతోనూ మెట్రో రైలు కనెక్టివిటీ పెరుగుతుంది. అదే విధంగా శ్రీకాకుళం వరకూ కూడా మెట్రో రైలు ప్రాజెక్ట్ ని కొనసాగించడం కూడా జరిగితే ఈ మూడు జిల్లాలు బాగా అభివృధ్ధికి నోచుకుంటాయి. ఓ విధంగా హైదరాబాద్ కి ధీటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రగతిపధంలో ముందుంటాయని కూడా అంటున్నారు.

Related Posts