YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భగ్గుమన్న అమరావతి...రోడ్డెక్కిన రాజధాని రైతులు...

భగ్గుమన్న అమరావతి...రోడ్డెక్కిన రాజధాని రైతులు...

భగ్గుమన్న అమరావతి...రోడ్డెక్కిన రాజధాని రైతులు...
పలు గ్రామాల్లో ఉద్రిక్తత...
బంద్ పిలుపు మేరకు రాజధాని గ్రామాల ప్రజలు బంద్‌కు పిలుపునివ్వగా..ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రతిపాదనపై సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటనపై రాజధాని అమరావతి పరిధిలోని రైతులు భగ్గుముంటున్నారు. సీఎం ప్రకటనకు నిరసనగా గురువారం రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు బంద్‌కు పిలుపునిచ్చారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకు ప్లాట్లు అప్పగించలేదని, మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బంద్ పిలుపు మేరకు రాజధాని గ్రామాల ప్రజలు బంద్‌కు లుపునివ్వగా..ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.తుళ్లూరు, మందడం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. పలుచోట్ల రహదారులపై రైతులు తమ వాహనాలను అడ్డుపెట్టారు. పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. ప్రభుత్వం తమ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related Posts