YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఓఆర్ఆర్ లో అడగడుగునా నిఘా

ఓఆర్ఆర్ లో అడగడుగునా నిఘా

ఓఆర్ఆర్ లో అడగడుగునా నిఘా
హైద్రాబాద్, డిసెంబర్ 19,
తొండుపల్లిలో చోటుచేసుకున్న ‘దిశ’ సంఘటన నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూర ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసేందుకు హెచ్‌ఎండిఎ సిద్దమైంది. ఈ మేరకు బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హరిచందన దాసరి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూర ప్రత్యేకంగా సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆమె నిర్ణయించారు. వీటి ఫుటేజీలను నిరంతరం పరిశీలిస్తుండాలని, అవసరమున్నా.. లేకున్నా ఫుటేజీలను పరిశీలించడం, తనిఖీలు చేయడవ వల్ల కెమెరాలు చూస్తున్నాయనే నేర ప్రవృత్తి, ఆ తరహా ఆలోచనాపరులు అటుగా రారనేది ఆమె అభిప్రాయంగా వెల్లడించారు.ఓఆర్‌ఆర్‌తో పాటు సర్వీసు రోడ్డు వెంట కూడా ప్రకాశవంతమైన వెలుతురు ఉండేలా విద్యుత్ దీపాలను అమర్చాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రజలకు, ప్రయాణికులకు ప్రయోజనకరమైన టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. ఓఆర్‌ఆర్, సర్వీసు రోడ్డు వెంట భద్రతను మరింత పెంచడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆమె పోలీసు అధికారులకు సూచించారు. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి పరచాలని, తద్వారా వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపేందుకు ఎలాంటి అవకాశాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ముఖ్యంగా ఔటర్, సర్వీసు రోడ్డు మార్గాల్లో పోలీసుల పాట్రోలింగ్‌ను మరింతగా పెంచాలని, తద్వారా విజిబుల్ పోలీసింగ్ అమలు జరుగుతుండటంతో ప్రమాదాలుగానీ, నేరాలుగానీ, పలు రకాల సంఘటనలు నివారించినట్టుగా ఉంటుందని హరిచందన పేర్కొన్నారు. ఔటర్ వెంట ప్రధాన ప్రాంతాల్లో సైనేజ్‌లను ఏర్పాటు చేయడం, పలురకాల సూచికలు, వివరాలు, టోల్‌ఫ్రీ నెంబర్లను వీటిల్లో పొందుపరచాలని ఆమె చెప్పారు. నానాక్‌రాం గూడ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతుండటం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి విజయ్‌కుమార్ రెడ్డి, శంషాబాద్ డిసిపి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts