యాసంగిలో జోరుగా వరినాట్లు
మహబూబ్ నగర్, డిసెంబర్ 19,
యాసంగి వరి నాట్లు జోరుందుకున్నాయి. నెట్టెంపాడు పథకం ద్వారా పుష్కలంగా నీరందుతుండటంతో సాగు విస్తీర్ణం మరింతగా పెరగనుంది. ఉమ్మడి మండలంలో నలభైకి పైగా చెరువులు, కుంటలకు నెట్టెంపాడు సాగు నీరందింది. ముంగారి సీజన్ అదునులో నెట్టెంపాడు పంపింగ్ ప్రారంభం కావడంతో సకాలంలో ముంగారి వరినాట్లు పడి ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించారు. కాలువల కింద ఉన్న చెరువులకు, ఉప జలా శయాలకు గతంలో నీటి విడుదలను కొనసాగించిన నేపథ్యంలో రైతులు ప్రత్యక్ష, పరోక్ష ఆయకట్టు ద్వారా సాగు మొత్తాన్ని పెంచుతూ వస్తున్నారు. కాగా జూరాల కింద మాత్రం ఈ సారి సాగు లేకుండా ఉన్నది. జలాశ యంలో ఇప్పటికే రోజు రోజుకూ నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. దీంతో యాసంగి పంటలకు వదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నీటి విడుదల ఉన్నా.. వారంబంధీ పద్ధతిన ఉం డే అవకాశం ఉన్న నేపథ్యంలో వరినాట్లకు అవకాశం లేదు.అదే సమయంలో వర్షాభావ పరిస్థితుతో సాధారణ సాగు కన్నా కొంచెం తక్కువగానే ఉన్నా, నెట్టెంపాడు పథకం నీరు పాడడంతో నాట్లు ముమ్మరంగా వేశారు. కానీ ఈ యాసంగిలో మాత్రం నెట్టెంపాడు పథకం కింద వరి సాగు కాస్త అనుమానంగానే ఉన్నది. గడిచిన రెండు నెలలుగా జూరాలకు అనుకున్న మేర ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో నెట్టెంపాడు పథకంలో పంపింగ్ నిలిచి ఉన్నది. దీంతో గతంలో ప్రధాన జలాశయాలలో ఉన్న నీటిని ముంగారి సాగు అవసరాలకు వాడారు. ప్రస్తుతం ర్యాలంపాడు జలాశయం అడగంటుతోంది. గుడ్డెందొడ్డిలో కొంత పరువాలేదనిపించే విధంగా నీరున్నా, 99వ ప్యాకేజీ అసంపూర్తితో సాగు విస్తీర్ణం పెరలేదు. కాగా ఇదివరకే చెరువులు నిండి ఉండటంతో భూగర్భజలాలు బాగా పెరిగాయి. దీంతో కొంత మేర రైతులు సాగుకు సన్నద్దం అవుతున్నారు. సాగు నీటికి ఇక ఏమాత్రం ఢోకా లేక పోవడంతో రైతులు ఉత్సాహంగా వరి సాగును చేపడుతున్నారు. అదే సమయంలో ముంగారి వరి ధాన్యానికి మద్దతు ధరలకు మించి ధర పలకడంతో రైతులు మరింత ఉత్సాహంగా సాగును ముమ్మరం చేశారు. మరి కొందరు రైతులు ముం దస్తుగానే సాగు చేసి ఉన్నా.. ఇదే సమయం అదునుగా నాట్లు అధికంగా వేస్తున్నారు. నీటి కొరత లేకపోవడం, పుష్కలంగా కరెంటు, కూలీల కొరత కూడా అంతగా లేక పోవడంతో అనుకున్న సమయం లోనే వరి నాట్లను పూర్తి చేస్తున్నారు .నడిగడ్డ ప్రాంతానికి మొ త్తంగా సాగు ఊపందు కోవడానికి నెట్టెంపాడు పథ కంలోని జలాశయం ర్యాలం పాడు ప్రధాన నీటి వనరుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ నాలుగు టీఎంసీలు కాగా 0,36 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉన్నది. రెండు నెలలుగా పంపింగ్ ఆగిపోవడంతో ఉన్న నీరంతా పంటలు కాపాడటానికి విడుదల చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో కాలువలు పూర్తిగా కట్టివేస్తామని చెప్పారు. అదే సమయంలో గుడ్డెందొడ్డి జలాశయంలో టీఎంసీకి పైగా నిల్వ ఉంది. కానీ కేవలం ఈ జలాశయం పరిధిలో ఎడమ కాలువ కింద మాత్రమే సాగుకు విడుదల చేస్తున్నారు.