YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

మత్స్య కారులు కొత్త ఇబ్బందులు

మత్స్య కారులు కొత్త ఇబ్బందులు

మత్స్య కారులు కొత్త ఇబ్బందులు
నల్గొండ, డిసెంబర్ 19,
వర్షాభావ పరిస్థితుల వలన సరైన వానలు కురవకపోవడంతో కొన్ని చెరువులు నిండక, నిండినా మరికొన్ని చెరువుల్లో ప్రభుత్వం వదిలిన సబ్సిడీ చేపపిల్లలు నాసిరకం కారణంగా అభివృద్ధి చెందకపోవడంతో మత్సకారులకు చేపల వేట కరువైంది. దీంతో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మండల కేంద్రంలోని దాదాపు 400 కుటుంబాలకు పని లేకపోవడంతో కుటుంబం గడవక దిక్కులేని తప్పని పరిస్థితులో మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. 5 సంవత్సరాల నుంచి మండలంలో సరైన వానలు కురవకపోవడంతో డిండి ప్రాజెక్టులో నీరులేక తమ కుటుంబ పోషణకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి బతుకుతున్నారు.  గతేడాది ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రజాప్రతినిధులైన ఎంపి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డెడ్‌స్టోరేజీ దశకు చేరిన డిండి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తిస్థాయి వరకు నీటిని అందించారు. అప్పట్లో ప్రభుత్వం ఉచితంగా ప్రాజెక్టులోకి వదిలిన చేపపిల్లలు అభివృద్ధి చెందడంతో ఈ ఏడాది దాదాపు 6 నెలల నుంచి మత్సకారులకు చేపల వేట సమృద్ధిగా సాగింది. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే పని దొరుకుతుండటంతో కరువు నుంచి విముక్తి చెందుతామని మత్సకారులు భావిస్తున్న పమయంలో ఈ ఏడాది ఖరీఫ్ పంటకు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌స్టోరేజీ దశకు చేరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాజెక్టులోకి నీరు అందించక, ప్రాజెక్టులో నీరు రోజురోజుకు తగ్గడంతో మత్సకారులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో తాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతామనుకున్న మత్సకారుల ఆశలు గల్లంతైనట్లేనని పలువురు మత్సకారులు వాపోతున్నారు.హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో నల్లగొండ–, నాగర్‌కర్నూల్ జిల్లా సరిహద్దు ప్రాంతం జిల్లా కేంద్రానికి దాదాపు 100 కిలోమీటర్ల దూదంలోనున్న డిండి మండల కేంద్రంలో దుందిబి నదిపై డిండి ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో 50 ఏళ్ల  కాలంలో మత్సబీజ క్షేత్రాన్ని ఏర్పాటు చేసారు. అప్పటి నుంచి వర్షాలు బాగా కురవడంతో, కాలువల ద్వారా వచ్చే నీటిని మత్స బీజక్షేత్రంలో చేపపిల్లల ఉత్పత్తికి వాడుతున్నారు. కాల క్రమేణ ప్రకృతి కరుణ మందగించడం వల్ల వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు నిండడం కష్టంగా మారింది. దీంతో నీటి వసతి లేకపోవడంతో మత్సబీజక్షేత్రం నిరుపయోగంగా మారి అధికారుల పర్యవేక్షణ తగ్గడంతో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి

Related Posts