రైతుల రాస్తారోకో
మంచిర్యాల డిసెంబర్ 19,
అన్నదాత ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కూడా అమ్మేందుకు రోడ్డెక్కి నిరసనలు తెల్పవలసిన పరిస్థితులు మాంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లో నెలకొన్నాయి. తేమ శాతాన్ని సాకుగా చూపి కొనుగోలు కేంద్రం లో నిల్వ ఉన్న వరి ధాన్యం తూకం వేయకుండా రోజుల తరబడి ఆలస్యం చేస్తూ ఒక వైపు ప్రభుత్వం మరియు మరోవైపు మిల్లర్లు రైతును అరిగోస పెడుతున్నారని రైతుల ఆరోపణ.దీనితో రైతులు న్యాయం కోసం రాస్తారోకో లు చేయవలసిన పరిస్థితి వచ్చింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కీ వెంకటాపూర్ గ్రామంలో రహదారిపై రైతులంతా రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కొక్క రైతు పదిహేను రోజుల నుండి నెలరోజుల వరకు వడ్లను కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన కూడా తేమశాతం రాలేదనే సాకుతో తూకం వేయడంలేదు. తూకం వేసినా కూడా మిల్లర్లు తేమ అధికంగా ఉందని చెబుతూ కోత విదిస్తున్నారు. తాజాగా నెల్కీ వెంకటాపూర్ ఐకెపి సెంటర్ నుండి ఒక లారీ వడ్ల లోడ్ రైస్ మిల్ కు చేరింది. లారీ తో పాటు రైతు కూడా రైస్ మిల్ కు వెళ్ళాడు, కానీ రైస్ మిల్ యజమాని ధాన్యం లో తేమ శాతం అధికంగా ఉందని రైతును బయటకు వెళ్లాలని కోపగించి, లారీని తిప్పి పంపాడు. దీనితో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు 17 శాతం తేమ ఉన్న వరి ధాన్యం ను తూకం వేయాలని ఆదేశించారు.