YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మతోన్మాద మంటల్లో చలికాచుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శ

మతోన్మాద మంటల్లో చలికాచుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శ

మతోన్మాద మంటల్లో చలికాచుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు
          బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శ
హైదరాబాద్ డిసెంబర్ 18  
: పౌరసత్వ బిల్లుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వక్రభాష్యం చెబుతున్నాయని, మతోన్మాద మంటల్లో చలికాచుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత దేశ ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పౌరసత్వ బిల్లుకు... భారత ముస్లింలకు సంబంధం లేదని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. ముస్లింలను బిల్లులో చేర్చలేదంటున్న టీఆర్ఎస్ నేతలు పాకిస్తాన్ ముస్లింలను చేర్చలేదని భాధగా ఉందా? అని అన్నారు. టీఆర్ఎస్ పాకిస్తాన్‌కు వత్తాసు పలుకు తోందా?, ఇమ్రాన్‌ఖాన్‌కు పౌరసత్వం ఇవ్వలేదని ఆక్రోషమా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. మత రాజకీయాలు చేసే కాంగ్రెస్ పౌరసత్వ బిల్లును రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ముస్లిం పక్షపాతంతో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు కళ్ళుమూసుకుపోయి.. పనికిరాని గొడవ చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు అనుకూలం అయిన నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ, అమిత్ షాలను ఎవరు నిలువరించలేరని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల అవకాశవాద రాజకీయాలను ప్రజల ముందుకు తీసుకు వెళతామన్నారు. పౌరసత్వ బిల్లు గురించి ఈ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

Related Posts