YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పాఠశాలపై సీఎం జగన్ సమీక్ష

పాఠశాలపై సీఎం జగన్ సమీక్ష

పాఠశాలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి డిసెంబర్ 18  
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు– నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ గురువారం సమీక్ష జరిపారు. మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో నాడు– నేడు కార్యక్రమం అమలు జరుగుతుంది.  నాడు–నేడు కార్యక్రమంలో పాల్గోనే  1100 మంది ఇంజినీర్లకు శిక్షణ పూర్తి అయింది. నాడు–నేడు కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా  అవగాహన కల్పించామని  అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.  6,89,491 స్కూళ్లలో ఫర్నిచర్, సామాన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ చేయాల్సిన పనుల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యం. స్కూళ్లలో బాత్రూమ్స్, తాగునీరు బాగుండాలి. నేను గ్రామాల్లో పర్యటనకు వెళ్తున్నప్పుడు కచ్చితంగా వాటిని పరిశీలిస్తాను. రెండో విడతలో స్కూళ్లకు జూన్ నుంచి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలి. దీనికోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకోండని సూచించారు.  పాఠ్యప్రణాళిక తయారీపై సీఎం మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పుస్తకాలు సహా మొత్తం స్కూలు కిట్ ఇవ్వాలి. పాఠ్యాంశాల తయారీలో యూనివర్శిటీ ఆఫ్ షికాగో, సింగపూర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్శిటీ ఆఫ్ కాన్బెర్రా, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్, ఇఫ్లు, రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, ఐఐటీ మద్రాస్, అన్నా యూనివర్శిటీ సహకారం తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు.  టీచర్లకు ఇంగ్లిషు మీడియంలో బోధనపై శిక్షణ కొనసాగుతుందని,   94,889 మంది టీచర్లకు శిక్షణ ఇచ్చామని అన్నారు.  ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లిషులో మంచి పరిజ్ఞానం ఉందన్న విషయం శిక్షణ కార్యక్రమాల ద్వారా వెల్లడైందని అధికారులు తెలిపారు.  ఇంగ్లిషుమీడియంలో బోధన పట్ల ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఉన్నారన్న అధికారులు,  5, 6 తరగతి విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తామని సీఎంకు తెలిపారు. 

Related Posts