YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

విద్యార్థులు ఇది పరీక్షా సమయం టీవీలు, సెల్ ఫోన్లు దూరం పెట్టండి సోషల్ మీడియా కు దూరంగా ఉండండి కళాశాల అధ్యాపకులు వంద శాతంఫలితాలు తేవాలి

విద్యార్థులు ఇది పరీక్షా సమయం టీవీలు, సెల్ ఫోన్లు దూరం పెట్టండి సోషల్ మీడియా కు దూరంగా ఉండండి కళాశాల అధ్యాపకులు వంద శాతంఫలితాలు తేవాలి

విద్యార్థులు ఇది పరీక్షా సమయం టీవీలు, సెల్ ఫోన్లు దూరం పెట్టండి సోషల్ మీడియా కు దూరంగా ఉండండి
కళాశాల అధ్యాపకులు వంద శాతంఫలితాలు తేవాలి
బెజ్జంకి డిసెంబ‌ర్ 19 
బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి హరీష్ రావు గురువారం ప్రారంభించారు. తరువాత మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఇది పరీక్షల సమయం. ఈ సమయాన్ని వృధా చేయవద్దు. పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండి. టీవీలు, సినిమాలు చూడోద్దు. పరీక్ష పుస్తకాలు చదవండని సూచించారు. పరీక్షలు చాలెజింగ్ గా తీసుకోండి. మంచి మార్కులతో పాసయి తల్లిదండ్రులకు మంచి పేరుతీసుకు రండి. ఈ ఏడాది ఇంటర్ లోవందకు వంద శాతం ఫలితాలుండాలి. అసలు పాస్ అవడం కోసం చదవడమేంటి. ఉన్నత స్థాయి కి ఎదగాలంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలి. నిత్యం విజ్ఞానాన్ని పొందాలని అన్నారు. బెజ్జంకి కళాశాలో ఎకనమిక్స్, కామర్స్, సివిక్స్ సబ్జెక్టు లలో గత ఏడాది తక్కువ మార్కులు వచ్చాయని, ఈ సారి ఈసబ్జెక్టుల్లో విద్యార్థులు వందకు వంద శాతం పాస్ కావాలి. ఈ మేరకు మాట ఇవ్వాలని లెక్చరర్లు, విద్యార్థులు మాట ఇవ్వాలి. అందుకు ప్రతిగా విద్యార్థులు, లెక్చరర్లు మాట ఇచ్చారు. నిన్న 49  మంది విద్యార్థులు రాలేదు. ఇవాళ 29 మంది రాలేదు. విద్యార్థులు కాలేజీ మానవద్దు.  లెక్చరర్ కు కొద్ది మంది విద్యార్థులను కేటాయించి వారు తప్పనిసరిగా కాలేజికి  హజరయ్యేలా పర్యవేక్షించాలని అన్నారు. తల్లిదండ్రులను కలిసి కళాశాల కు హజరయ్యేలా సమావేశాలు నిర్వహించాలి. కళాశాలకు రాని విద్యార్థుల జాబితా గ్రామ సర్పంచ్ ల సాయం తీసుకోని, విద్యార్థులు కళాశాలకు వచ్చేలా చూడాలని అన్నారు. విద్యాశాఖాదికారులు ప్రతీ రోజు నాలుగు కళాశాలలు తిరిగాలి.విద్యార్థులు చదువుతున్నారా లేదా..కళాశాలకు వస్తున్నారా లేదా అన్న విషయాలు పరిశీలించాలి. తల్లిదండ్రులు విద్యార్థులను వ్యవసాయ పనులకు పంపోద్దని సూచించారు. ఇవాళ్టి నుండి మద్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నాం. రేపటి నుండి సాయింత్రం స్నాక్స్ ఏర్పాటు చేస్తాం. సాయింత్రం ఇక్కడేవిద్యార్తులు రెండు గంటలసేపు చదవాలి. అదనపు తరగతి గదులు కావాలని కోరారు. అందుకునలభై  లక్షల రూపాయలు అవసరం. మీరు వందకు వంద శాతం పాసయితే వెంటనే అదనపు  గదులకు అవసరమైన నిధులు ఇస్తామని అన్నారు. సిద్దిపేట జిల్లా లో ఇంటర్ ఫలితాల్లో బెజ్జంకి కళాశాల తొలి స్థానంలో నిలవాలని మంత్రి అన్నారు.  తరువాత మండల కేంద్రంలో నూతన మార్కెట్ కార్యాలయాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 

Related Posts