YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

త్వరలోనే జిల్లా స్థాయి దవాఖానాగా మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్    గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

త్వరలోనే జిల్లా స్థాయి దవాఖానాగా మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్    గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

త్వరలోనే జిల్లా స్థాయి దవాఖానాగా మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్
   గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, డిసెంబర్ 19 
దవాఖానాలకు రోగులు ఎంతో దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడొద్దనే గొప్ప ఉద్దేశ్యంతో వారికి అందుబాటులోనే వైద్యం ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ బస్తీ దవాఖానాలను తీసుకొచ్చారని, దీనివల్ల బస్తీవాసులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ఆమె బస్తీ దవాఖానాను ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లాకు మూడు ఆరోగ్య కేంద్రాలు మంజూరు కాగా ప్రస్తుతం ఒక కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని త్వరలోనే మరో రెండు కేంద్రాలను కూడా ప్రారంభించుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ ను జిల్లా స్థాయి హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయడం కోసం 60 కోట్ల రూపాయలను కూడా కేటాయించారని, త్వరలోనే ఈ పనులు ప్రారంభం అవుతాయన్నారు.మహబూబాబాద్ వెనుకబడిన జిల్లా కావడంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేశారని, ఇక్కడి ప్రజా ప్రతినిధులందరి సహకారంతో ఈ కాలేజీని వీలైనంత త్వరలో జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.జిల్లాలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేవిధంగా, అన్ని విధాల పరీక్షలు ఇక్కడే జరిగేలా కావల్సిన వైద్య సామాగ్రిని ఇక్కడకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని, జిల్లాను ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.దేవుడి తర్వాత ఆయనకు సమానంగా డాక్టర్ ను దేవుడిగా ప్రజలు భావిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎ.ఎన్.ఎం, ఆశావర్కర్లు, అంగన్ వాడీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వారు కూడా అదేస్థాయిలో ప్రజలకు సేవ చేయాలన్నారు. రాష్ట్రంలో ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తల్లిగర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుంచే వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పేద మహిళలు నెలలు నిండిన తర్వాత కూడా పనిచేస్తున్నారని, తద్వారా తల్లీ, బిడ్డలకు క్షేమం కాదని గుర్తించిన సిఎం, గర్భిణీ స్త్రీలు పనిచేయకుండా ఉండేందుకు వారికి ఆరు నెలలు వచ్చినప్పటి నుంచి ప్రసవం అయిన తర్వాత మూడు నెలల వరకు నెలకు 2000 రూపాయల చొప్పున ఆరు నెలల పాటు 12వేల రూపాయలు ఇస్తున్నారన్నారు.తల్లిదండ్రులు కూడా గొప్పగా ఆలోచించి నెలలు నిండిన మహిళలు 102 కు ఫోన్ చేస్తే వాహనం వచ్చి వారిని ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లి ప్రసవం చేయించేలా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు.పేద మహిళలు ప్రసవం అనంతరం ఇబ్బందులు పడకుండా ఉండాలని ధనికులు వాడే బ్రాండెడ్ వస్తువులతో కూడిన కేసిఆర్ కిట్ ఇస్తున్నారని, ఇందులో తల్లీ, బిడ్డలకు కావల్సిన అన్ని వస్తువులు అందిస్తున్నారని చెప్పారు.ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన మేరకు ఏ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లు, అంగన్వాడీలు పనిచేసి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, జాయింట్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో కొమురయ్య, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 

Related Posts