పాలకులు వ్యాపారం చేయకూడదు
తాడేపల్లి డిసెంబర్ 19
రాష్ట్రానికి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అవసరం రావచ్చని సీఎం అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. మంచి కాన్సెప్ట్ అంటున్నారు. ప్రతిపక్షం, చంద్రబాబు సహజంగా వ్యతిరేకిస్తారు. మేము ఏమి చేసినా చంద్రబాబు కు ఇష్టం ఉండదు, వ్యతిరేకిస్తారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో తెలియని పరిస్థితి. మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మించడం కాదు. రాజధానులు అంటే పట్టణాలు నిర్మించడం కాదు.. అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడమని అయన అన్నారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది . గతంలోనే ఇలాంటి ప్రయత్నం చేసివుంటే అభివృద్ధి సాధించి ఉండేవాళ్ళం. పాలకులు పరిపాలన చేసుకోవాలి తప్ప వ్యాపారం చేయకూడదు.-చంద్రబాబు అతని బినామీలు నాలుగువేల ఎకరాలు కొని సంపద సృష్టించుకున్నారు. సీఎం నిర్ణయం తరువాత కొంతమంది రైతుల పేరుతో చేస్తున్నది గమనించాలి. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూస్తుంది. రైతుల ముసుగులో సీఎం పై వ్యాఖ్యలు చేస్తే సహించమని అయన అన్నారు. ఆందోళన వ్యక్తం చేస్తే తప్పులేదు , ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించం. చంద్రబాబు చేసిన తప్పులు బయటకు వస్తాయి.. రెండు వేల ఎకరాల అసైన్డ్ భూములు అక్రమాలకు పాల్పడ్డారు. రాజధానులు ఏర్పాటైతే ఆటోమేటిక్ గా అభివృద్ధి సాగుతుంది. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని అయన అన్నారు.