YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాపాక  సస్పెండ్ అంటూ  లెటర్ వైరల్ 

రాపాక  సస్పెండ్ అంటూ  లెటర్ వైరల్ 

రాపాక  సస్పెండ్ అంటూ  లెటర్ వైరల్ 
విజయవాడ, డిసెంబర్ 19, 
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ లెటర్ కూడా వైరల్ అవుతోంది.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారన్న వార్తలతో జనసేన పార్టీలో అలజడి రేగింది. ఎమ్మెల్యే రాపాకతో పాటూ నేతలు షాక్ తిన్నారు.జనసేన పేరుతో వైరల్ అవుతున్న ప్రకటనలో.. ‘జనసేన పార్టీ విభాగం లో కొన్ని రోజులుగా వస్తున్నవిభేదాలు మరియు ఆంతరంగిక సమస్యల పై వివరణ. మన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ రావు గారు తన అభీష్టం మేరకు నడుచుకుంటూ.. పార్టీ నిర్ణయాలు కాకుండా సొంత అభిప్రాయాలతో ఉన్నందు వల్ల పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాజధాని మార్పు, రైతు సౌభాగ్య దీక్ష , ఇంగ్లీష్‌ మీడియం గురించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీ క్రమశిక్షణ నుఉల్లంపించడమే కాకుండా పార్టీ విధి విధానాలను అవహేళన చేస్తూ కొన్ని ప్రముఖ మీడియా ఛానళ్లలోలో మాట్లాడటం దృష్టికి రావడం జరిగింది’.‘ఈ కారణాలతో రాపాక వరప్రసాద్‌ గారిని పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం.కాబట్టి జనసైనికులు మరియు కారరలు నాయకులు సంయమనం పాటించి పార్టీ నిర్ణయాన్ని అందరూ ఏకాభిప్రాయం తో ఏకీభవించాలని కోరుకుంటూ.. శ్రీ రాపాక వరప్రసాద్‌ గారి భవిష్యత్‌ బాగుండాలని ఆ జగన్మాత ను ప్రార్ధిస్తూ ఉన్నాను’అంటూ పవన్ కళ్యాన్ పేరు మీద ప్రెస్ నోట్ వైరల్ అయ్యింది.ఈ లెటర్‌తో కంగుతిన్న జనసేన పార్టీ నేతలు ఏం జరిగిందని ఆరా తీస్తే.. ఇదంతా ఫేక్‌గా తేల్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ ఫేక్ లెటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు.ఇటు సోషల్ మీడియాలో కూడా జనసైనికులు స్పందిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో మల్లా ఒక ఫేక్ ప్రెస్ నోట్ మీడియాలో వైరల్ అవుతోందని.. కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై త్వరలో చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.ఇలా లెటర్ మాత్రమే కాదు.. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు జనసేన పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఫేక్ వార్తల్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాపాకకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Posts