YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆటలు దేశీయం

15.50 కోట్లు కమిన్స్

Highlights

⇢ జయదేవ్ ఉనద్కత్ - రూ.8.40 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
⇢ వరుణ్ చక్రవర్తి - రూ.8.40 కోట్లు (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
⇢ సామ్ కర్రాన్ - రూ.7.2 కోట్లు (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
⇢ కాలిన్ ఇన్‌గ్రామ్ - రూ.6.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
⇢ శివమ్ దూబే - రూ.5 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
⇢ మోహిత్ శర్మ - రూ.5 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
⇢ అక్షర్ పటేల్ - రూ.5 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
⇢ కార్లోస్ బ్రాత్‌వైట్ - రూ.5 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
⇢ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ - రూ.4.8 కోట్లు (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
⇢ మహ్మద్ షమీ - రూ.4.8 కోట్లు (కింగ్స్ ఎలెవన్)
⇢ నికోలస్ పూరాన్ - రూ.4.2 కోట్లు ( కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
⇢ షిమ్రోన్ హెట్మేయర్ - రూ. 4.2 కోట్లు (బెంగళూరు)
⇢ వరుణ్ ఆరోన్ - రూ.2.4 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
⇢ లసిత్ మలింగ - రూ.2 కోట్లు (ముంబై ఇండియన్స్)
⇢ హనుమ విహారీ - రూ.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

15.50 కోట్లు కమిన్స్

15.50 కోట్లు కమిన్స్
బెంగాల్, డిసెంబర్ 19,
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ దుమ్మురేపాడు. ఈసారి వేలంలో అత్యధిక ధర పలికి ఆటగాళ్లలో తనొక్కడిగా నిలిచాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన అతనికి అత్యంత భారీ ధర పలికింది. రూ.15.50 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తనను కొనుగోలు చేసింది.నిఖార్సైనా పేసర్ కమిన్స్ దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చాలా ఆసక్తి చూపించాయి. చివరకు కోల్‌కతా తనను దక్కించుకుంది. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కమిన్స్ కోసం గట్టి పోటీనిచ్చింది.దీంతో తొలుత తన దేశానికే చెందిన గ్లెన్ మ్యాక్స్ సాధించిన రూ.10.75 కోట్లను దాటని కమిన్స్.. ఆఖరివరకు పోరాడి కోల్‌కతా కైవసం చేసుకుంది. కమిన్స్ రాకతో తమ పేస్ దళం పటిష్టపడనుందని టీమ్ మేనేజ్‌మెంట్ ఇంత భారీ ధర వెచ్చించినట్లు తెలుస్తోంది.ఈసారి వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యా్క్స్‌వెల్ పంట పండింది. గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో తనను రూ.10.75 కోట్లు చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది.ఆల్‌రౌండ్ నైపుణ్యాలు, అద్భుతమైన ఫీల్డింగ్‌తో అలరించే మ్యాక్సీని కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ మధ్య పోరు హోరీహోరీగా సాగింది.దీంతో మ్యాక్సీ ధర రూ.10 కోట్ల మార్కును దాటింది. చివరికు రూ.10.75 కోట్లు చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ తనను దక్కించుకుంది. గతంలో కూడా పంజాబ్ తరపున మ్యాక్సీ ఆడాడు. మరోవైపు ఈ సీజన్‌లో తను ఆడలేదు. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం తను విరామం తీసుకున్నాడు.వేలంలోకి 42.70 కోట్లతో వేలంలోకి వచ్చిన పంజాబ్.. అందులో నాలుగో వంతు ధరను ఓ ప్లేయర్ కోసం వెచ్చించడం విశేషం.ఐపీఎల్ 2019 వేలంలో జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్‌ను పంజాబ్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఉనద్కత్‌ను రూ.8.40 కోట్లకు రాజస్థాన్ తిరిగి దక్కించుకుంది. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ రూ.7.2 కోట్లు పలికాడు. అతణ్ని పంజాబ్ సొంతం చేసుకుంది. కాలిన్ ఇన్‌గ్రామ్‌ను రూ.6.4 కోట్లు వెచ్చించి ఢిల్లీ కొనుగోలు చేసింది. సీనియర్ స్థాయిలో టీ20 కూడా ఆడని 18 ఏళ్ల ప్రభ్‌సిమ్రన్ సింగ్ 4.80 కోట్లకు అమ్ముడయ్యాడు.శివమ్ దూబే, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కార్లోస్ బ్రాత్‌వైట్ రూ.5 కోట్ల చొప్పున ధర పలికారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సాహాను తిరిగి సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో కూడా ఆరెంజ్ ఆర్మీలో చేరాడు. తాాజా మోహిత్ శర్మ, జయదేవ్ ఉనద్కత్ మళ్లీ వేలంలోకి వచ్చారు.
ఐపీఎల్  2019: వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే!
 

Related Posts