YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 మోడీకి ప్రత్యామ్నయం... భారత్ లో ఉండాలంటూ పంచ్

 మోడీకి ప్రత్యామ్నయం... భారత్ లో ఉండాలంటూ పంచ్

 మోడీకి ప్రత్యామ్నయం... భారత్ లో ఉండాలంటూ పంచ్
ముంబై, డిసెంబర్ 19 
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కుతీసుకోవాలని ప్రతిపక్షాలు సహా మేధావులు, ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పడాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రత్యామ్నాయం భారత్‌లో ఉండాలంటూ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి సిద్ధమవుతుందనా అని మీడియా అడిగిన ప్రశ్నకు పవార్ స్పందిస్తూ.. ‘దేశంలో కొన్ని చోట్ల బీజేపీ వ్యతిరేక నిరసనలు పెరుగుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ మార్పు కోసం బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరనమి, అయితే, ఆ ప్రత్యామ్నాయం భారత్‌లోనే ఉండాలని పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం మాదిరిగానే ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఆర్‌సీని అమలుచేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన పవార్.. సీఏఏ న్యాయసమీక్షలో నిలబడుతుందా అనే అంశంపై చర్చ జరుగుతోందని అన్నారు. ఈ చర్చకు ఇరువైపులా ప్రజలు ఉన్నారని, వారిని ఒప్పించగలుగుతారా? అనేది వేచిచూడాలని అన్నారు.చట్టాన్ని కేంద్రం తప్పనసరి చేసింది.. దీని అమలుపై మాత్రం రాష్ట్రాలు కొంతకాలం జాప్యం చేయవచ్చు కానీ, అందరూ కలిసికట్టుగా వ్యతిరేకిస్తారో? లేదో తనకు తెలియదన్నారు. కేంద్రం చేసిన చట్టాలు పూర్తిస్థాయిలో అమలుకావాలంటే రాష్ట్ర యంత్రాంగం ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు. చట్టాన్ని అమలుచేయకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారు అంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఆర్టికల్ 356ను ప్రయోగించి, రాష్ట్రపతి పాలన విధించడం అంత సులభం కాదన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో పెద్ద సంఖ్యలో మైనార్టీలు పాల్గొంటున్నారని అన్నారు.పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సహా విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సమయంలో రాహుల్‌ గాంధీ విదేశ్రీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున రాహుల్ గాంధీ.. బుధవారం నాడు ఆ దేశ ప్రధాని లీ నాక్-యన్‌‌ను కలిశారు

Related Posts