YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జేసీ కామెంట్స్ పై దుమారం

జేసీ కామెంట్స్ పై దుమారం

జేసీ కామెంట్స్ పై దుమారం
అనంతపురం, డిసెంబర్ 19, 
పోలీసులను ఉద్దేశించి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా తాను చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత సమర్థించుకున్నారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. కొంత మంది వరస్ట్ పోలీసులను ఉద్దేశించిన అలా మాట్లాడానని ఆయన చెప్పారు. బుధవారం అనంతపురంలో జరిగిన జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జేసీ.. పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారని, వారికి వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జేసీ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులపైనా ఇవే కేసులు పెడతామన్నారు. పోలీసు అధికారులు ఎమ్మెల్యేకు మాత్రమే సెల్యూట్‌ కొడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే బూట్లు నాకే అధికారులను తెచ్చుకుంటామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమక్షంలోనే జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మాజీ ఎంపీ వ్యాఖ్యలపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. జేసీ హుందాగా ప్రవర్తించాలని పోలీసులు కోరుతున్నారు. జేసీని అందరూ జోకర్ లా చూస్తున్నారని ఆయనకి భయపడే కాలం పోయిందని.. గన్‌మెన్లను వదిలి ఆయన బయట తిరగగలరా అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లగా పోలీసులే ఆయనకు రక్షణ కల్పిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు.ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపైనా జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. జగన్ రాజధాని, అసెంబ్లీని వేర్వేరు చోట్ల పెట్టేంత అవివేకుడు కాదన్నారు.

Related Posts