YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

దాసో-హం

దాసో-హం

దాసో-హం
దాసోహం అన్న పదంలో అహం ఒక భాగం. విడదీయరాని అక్షర సమాహారం. అహం అంటే నేను. నేను నీ దాసుణ్ని అని మనసా, వాచా చెప్పగలగాలి.
‘దాసోహం’ అన్నమాటను ఒక మంత్రంగా స్మరించడం, గుణాత్మకంగా మరిమరి గుర్తు చేసుకోవడం, మనసును ఏకాగ్రం చేసి అక్కడే నిలపడం- చెప్పినంత తేలిక కాదు. శ్రవణం, మననం, ధ్యానం భక్తియోగ సాధనకు కలిసివచ్చే భౌతిక, మానసిక, ఆంతరంగిక ప్రక్రియలు. అవి దాసోహానికి దారిదీపాలు.ఒకరికి తలవంచి నమస్కరించడం బానిసత్వానికి నిదర్శనం. ఒకరి గొప్పతనాన్ని బేషరతుగా ఒప్పుకొని శరణాగతి కోరడం భక్తి పరాకాష్ఠకు సంకేతం. ప్రతి నిమిషం, ప్రతి విషయంలోనూ బయటపడి అడ్డుకునేది ‘అహం’. ‘నన్ను అడిగావా?’ అని నిలదీయడం, ‘నాకు తెలియదే!’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించడం... అదే అహంకారం! పూర్ణ దాసత్వం ఆషామాషీ కాదు. నవవిధ భక్తి మార్గాల్లో దాస్యానికి సముచితమైన స్థానం ఉంది. నమ్రతా భావంతో కూడిన వినయ విధేయతల త్రివేణీ సంగమంతో సమానమైనది దాస్య భక్తి. నిజమైన హరిదాసుడు దాసోహం అనడానికి, అలా కావడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. తన అస్తిత్వాన్ని పోగొట్టుకుని పరతత్త్వంలో లీనం కావడానికి- పాలలో పంచదారగా మారాలి. దాసుడికి అది ఒకరకమైన జీవన్ముక్త దశ. అహంకారం బండరాయిలా ఎప్పటికప్పుడు అడ్డుతూ, చాపకింద నీరులా తెలియకుండా తడిగట్టి పడగొట్టుతుంది.హరిదాసు అనగానే... సంక్రాంతి పండుగ రోజుల్లో తలపైన పాత్ర, చేత చిడతలు, భుజాన తంబురా వేసుకుని ‘హరిలో రంగ హరి’ అంటూ చిందులు వేసే ఆసామీ కళ్లకు కడతాడు. హరిదాసు అన్న బిరుదు బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షికే చెల్లుతుంది. సదా నారాయణ నామస్మరణలో కాలంగడిపే నారదుడికన్నా మిన్న అయిన విష్ణుభక్తుడు ఎవరైనా ఉన్నారా? రామదాసు అన్న పేరు మన దేశంలో మిక్కిలి జనప్రియమైన నామం. రామదాసు అంటే రామబంటు- హనుమంతుడు. ఈ పేరులో రాముడు తప్ప మనకు హనుమంతుడు కనిపించడు. ఆ పదాన్ని విడదీసి శల్యపరీక్ష చేస్తేగాని అందులో దాగిన దాసుడు- ఆంజనేయుడు బయటికి రాడు. తులసీదాసు- తులసికి దాసుడు శ్రీమహావిష్ణువు. తులసిలో కలిసి ఉన్న ఆ పరమాత్మను స్మరించడానికి, మనోనేత్రంతో దర్శించడానికి ‘కృష్ణ తులసి’ అన్న ప్రయోగం మనకు ప్రయోజనకరంగా కలిసి వస్తుంది. రుక్మిణి ఒక్క తులసిదళంతో కృష్ణ తులాభారంలో నెగ్గింది.మనల్ని మనం దాసుడిగా గుర్తించడానికి ముందుగా మోహనిద్ర నుంచి మేలుకుని బయటపడాలి. చెలికాడు, శిష్యుడు, బావమరిది అయిన అర్జునుడికి తాను కృష్ణదాసుడినని తెలుసుకోవడానికి, పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల శ్లోకాలు అవసరమయ్యాయి. చిట్టచివరికిగాని, ‘ఓ అచ్యుతా! నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అన్న సమాధానం కిరీటి నోటంట రాలేదు. దాస సంప్రదాయంలో సర్వోత్తమమైన భక్తి నివేదనా గరిమకు ఉదాహరణ దాసకూటం పేరు చెప్పగానే మన తలపులో మెరుపులా కనకదాసు కనిపిస్తాడు. ఆ భక్త శిఖామణి కోసం ఉడుపిలోని బాలకృష్ణుడు తన దిశను మార్చుకుని, కనకదాసు దశను మార్చాడు. క్షణంలో భక్తుడికి మోక్షం ప్రసాదించాడు. పురందరదాసు శ్రీకృష్ణ దేవరాయల రాజధాని హంపీ క్షేత్రంలో తన కీర్తనలు వినిపించి, స్వర సేవకులందరికీ ఆదర్శంగా స్ఫూర్తిమన్మూర్తిగా ఈనాటికీ సంప్రదాయ భక్తి సంగీతపు మెరుపులు కురిపిస్తున్నాడు. బద్ధ జీవులను భక్తి సేవలతో తన అక్కున చేర్చుకోవడానికి భగవంతుడు సర్వదా సి

Related Posts