YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

హత్యాచారాలపై పోలీస్ బాస్ ల ఆందోళన

హత్యాచారాలపై పోలీస్ బాస్ ల ఆందోళన

హత్యాచారాలపై పోలీస్ బాస్ ల ఆందోళన
వరంగల్, డిసెంబర్ 20, 
నేరాలపై రాష్ట్ర పోలీసు బాసులు సీరియస్‌గా ఉన్నారు. వరంగల్‌లో మనీష, ఆదిలాబాద్‌లో సమత, దిశ నేరాలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమీషనరేట్‌లకు ఆదేశాలిచ్చినట్లు ఎడిజిపి జితేందర్ తెలిపారు. నేరాలకు సంబంధించి నిందితులకు కఠిన శిక్షలు పడేంతవరకు పోలీసులు విశ్రమించరాదని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. ముఖ్యంగా నేరాలకు పక్కా ఆధారాలు సేకరించడంతో పాటు కన్విక్షన్ రేట్ ను పెంచిన పబ్లిక్ ప్రాసిక్యూటార్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు (సిడిఓ), ఇన్వెస్టిగేషన్ అధికారులకు ప్రోత్సాహకంగా మరిన్ని చర్యలు చేపట్టనున్నామన్నారు. అదేవిధంగా నేర పరిశోధనలో ప్రతిభ చూపుతున్న పోలీసులను ప్రోత్సహించడానికి 17 వర్టికల్స్ లో భాగంగా కోర్టు వర్టికల్ కింద (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్) ఆధారంగా కోర్టులో కన్విక్షన్ రేట్ ను పెంచిన ఐఓలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, సిబ్బందికి రివార్డులు అందజేస్తామని తెలిపారు.రాష్ట్రంలో కన్విక్షన్ రేట్ ను పెంచేందుకు పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, మరింత శ్రమించి నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. సంచలనాత్మక కేసుల్లో అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తే దోషలకు కటిన శిక్షలు పడతాయన్నారు. రాష్ట్రంలో శిక్షల శాతాన్ని ఇంకా పెంచాలని సూచించారు. కన్విక్షన్లను పెంచడంలో దర్యాప్తు అధికారులతో పాటు కోర్టు డ్యూటీ ఆఫీసర్లు ముఖ్య భూమిక పోషించాలన్నారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎఫ్‌ఐఆర్ నమోదు, ఇన్వెస్టిగేషన్ ప్రతీ స్టేజ్ లో దృష్టి సారించాలన్నారు. కేసు కట్టడం ఒక ఎత్తైతే, ఇన్వెస్టిగేషన్ చేయడం, కన్విక్షన్ తీసుకురావడం మరో ఎత్తన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడిన వారికి వెంటనే శిక్షలు పడితే అలాంటి నేరాలు జరగకుండా ఉంటాయన్నారు. కేసు తుది తీర్పు వెలువడి దోషులకు శిక్షపడేలా జాగ్రత్తగా పని చేయాలన్నారు.సెన్సేషనల్ కేసులను రోజువారీ ఫాలోఅప్ చేయాలని సూచించారు. సెన్సిటివ్, ఎక్కువ మందిని ప్రభావితం చేసే సెన్సేషనల్ కేసులను గుర్తించి సత్వరం పరిష్కరించాలన్నారు. సంచలనాత్మక కేసు ల్లో పోలీసులు నిబద్ధతతో పని చేయాలన్నారు. కేసు దర్యాప్తుల విషయంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న నేరాల విషయంలో వెంటనే కేసులు కట్టడంతో పాటు వేగంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. అదేవిధంగా ఆర్థిన నేరాలైన పల్లీ యంత్రాలు, క్యూనెట్, విజ్డం తదితర ఆర్థిక నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ ఎత్తున ఆర్థిక నేరాల విషయంలో బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా నేరానికి సంబంధించిన సాక్షాలను బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Related Posts