YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

అటకెక్కతున్న రైల్వే ప్రాజెక్టులు తెలంగాణ వాటా ఇవ్వకపోవడంతో పనులకు బ్రేక్

అటకెక్కతున్న రైల్వే ప్రాజెక్టులు తెలంగాణ వాటా ఇవ్వకపోవడంతో పనులకు బ్రేక్

అటకెక్కతున్న రైల్వే ప్రాజెక్టులు
తెలంగాణ వాటా ఇవ్వకపోవడంతో పనులకు బ్రేక్
హైద్రాబాద్, డిసెంబర్ 20, 
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కేంద్రం తన వంతు వాటా చెల్లిస్తున్నా రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోతున్నాయి. ముఖ్యంగా మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– అక్కన్నపేట, మనోహరాబాద్ -– కొత్తపల్లి, ఎంఎంటీఎస్ ఫేజ్ 2, ఆదిలాబాద్ – -ఆర్మూర్, భద్రాచలం- – సత్తుపల్లి పనులు ముందుకు సాగడంలేదు. ఇవే కాకుండా సుమారు 200 రైల్వే ఓవర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి, రైల్వే అండర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిల పనులు ఆగిపోయాయి. గతంలో రైల్వే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లకు ఖర్చంతా కేంద్రమే భరించేది. కానీ కొన్నాళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. దీంతో కేంద్రం తన నిధులు విడుదల చేసినా రాష్ట్రం పట్టించుకోకపోవడంతో పనులులన్నీ పెండింగ్లో పడిపోతున్నాయి.2012–13లో 17 కిలోమీటర్ల దూరానికి 118 కోట్లతో అక్కన్నపేట– మెదక్‌‌‌‌‌‌‌‌ కొత్త లైన్‌‌‌‌‌‌‌‌ మంజూరైంది. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం తెలంగాణ ప్రభుత్వం భరించడానికి ఒప్పుకొని, లైన్ కోసం ఉచితంగా భూమి కూడా ఇచ్చింది.  2019 మే 18న అక్కన్నపేట స్టేషన్ పనులు మొదలయ్యాయి. ఈ లైన్లో లక్ష్మాపూర్, షమ్నాపూర్, మెదక్‌‌‌‌‌‌‌‌లో 3 కొత్త రైల్వే స్టేషన్లు, 3 భారీ వంతెనలు, ఒక ఆర్వోబీ, 35 మైనర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిలు, 15 ఆర్‌‌‌‌‌‌‌‌యూబీలు ఉన్నాయి. ప్లాన్ ప్రకారం 2019 ఆగస్టులో అందుబాటులోకి తేవాలని అనుకున్నా, తెలంగాణ స్టేట్ నిధులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.105.38 కోట్లు భరించాల్సి ఉండగా రూ.21.15 కోట్లే డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇప్పటివరకు అయిన వ్యయం ప్రకారం ఇంకా రూ.50.41 కోట్లు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంది.2010–11లో 704 కోట్లతో భద్రాచలం-–సత్తుపల్లి కొత్త లైను (56.25 కి.మీ.) ప్రాజెక్టు మంజూరైంది. దీన్ని రైల్వే, సింగరేణి కలిసి సంయుక్తంగా చేపడుతున్నాయి. ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రైల్వే ఇవ్వగా, మిగతా పనులన్నీ సింగరేణి చేపట్టాల్సి ఉంది. సర్వే పూర్తయ్యి, భూసేకరణ ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఖమ్మం జిల్లాలో 280 ఎకరాలకు 255 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 570 ఎకరాలకు 519 ఎకరాలు అప్పగించారు. ఇతర భూసేకరణ పనులు నడుస్తున్నాయి. రూ.619 కోట్లు సింగరేణి భరించాల్సి ఉన్నా కేవలం రూ.156.38 కోట్లే చెల్లించింది. అన్ని రకాల ధరలు పెరగడంతో ప్రాజెక్టు వ్యయాన్ని952 కోట్లకు పెంచారు.2016-–17లో మనోహరాబాద్‌‌‌‌‌‌‌‌– కొత్తపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ( 151.40  కి.మీ) 1160 కోట్ల అంచనాతో మంజూరైంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ వ్యయంలో 1/3 శాతం ఖర్చు, ల్యాండ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. 4 దశల్లో పనులు పూర్తి చేయాలి. దీనికి సంబంధించి 90 శాతం ల్యాండ్‌‌‌‌‌‌‌‌ అప్పగించారు. మొదటి దశ గజ్వేల్‌‌‌‌‌‌‌‌ వరకు 2019 మార్చికే పూర్తి కావాల్సి ఉన్నా పది శాతం ల్యాండ్‌‌‌‌‌‌‌‌ సేకరణ, జాతీయ రహదారిపై మళ్లింపు, మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ డైవర్షన్‌‌‌‌‌‌‌‌తో ముందుకు సాగడం లేదు. 2019 మార్చికే పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే పనుల్లో జాప్యం కారణంగా 2020 జవనరిలో పూర్తి చేసేందుకు ప్లాన్చేస్తున్నారు. ఈ లైను నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.307 కోట్లు భరించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.60 కోట్లే డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇప్పటి దాకా చేసిన ఖర్చు ప్రకారం ఇంకా రూ.71.61 కోట్లు తమకు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంది.2008–09 లో ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ – ఆర్మూర్‌‌‌‌‌‌‌‌ కొత్త లైన్‌‌‌‌‌‌‌‌ (136 కి.మీ.) సర్వే మంజూరైంది. 2010లో రూ.697.97 కోట్ల వ్యయం అవుతుందని రైల్వే బోర్డుకు నివేదిక అందింది. 2014 –15లో కొత్త సర్వే చేశారు. తర్వాత పటాన్‌‌‌‌‌‌‌‌చెరు నుంచి నిర్మల్‌‌‌‌‌‌‌‌ మీదుగా ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ వరకు రివైజ్డ్‌‌‌‌‌‌‌‌ సర్వే చేశారు. దీని ప్రకారం 4109.32 కోట్ల వ్యయం అవుతుందని తేలింది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ ఆర్మూర్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఫైల్‌‌‌‌‌‌‌‌ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లిస్తే పనులు పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రయాణ దూరం తగ్గనుంది.రాష్ట్రంలో సుమారు 200 ఆర్వోబీ, ఆర్‌‌‌‌‌‌‌‌యూబీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో  కొన్ని ప్రాజెక్టుల నిధులు కేంద్రం, రాష్ట్రం 50శాతం చొప్పున భరించాలి. మరికొన్ని మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలన్నది ఒప్పందం. కానీ నిధులు లేకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. మొత్తం 200 చోట్ల పనులు చేపట్టాల్సి ఉండగా 50 అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. దీంతో చాలాచోట్ల రోడ్డు దాటడానికి రైళ్లు వెళ్లే దాకా ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.2012-–13లో 817 కోట్ల అంచనాతో ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌2 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మంజూరైంది. ఈ పనులు ఐదున్నర ఏండ్లుగా కొనసాగుతున్నాయి. తెల్లాపూర్- –రాంచంద్రాపురం సెక్షన్‌‌‌‌‌‌‌‌లో 6 కిలోమీటర్ల వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. 20 కిలోమీటర్ల దూరం ఉన్న మల్కాజ్‌‌‌‌‌‌‌‌-గిరి– –బొల్లారం డబుల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తయ్యాయి. మేడ్చల్‌‌‌‌‌‌‌‌– బొల్లారం, మౌలాలి– ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌ పనులు కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా– ఉమ్దానగర్‌‌‌‌‌‌‌‌ మధ్య పనులు  కొనసాగుతున్నాయి.  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ వ్యయం 817 కోట్ల కాగా, రాష్ట్రం రూ.544 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే రూ.272 కోట్లు భరించాలి. అయితే  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.110 కోట్లు మాత్రమే విడుదల చేయగా, రైల్వే తన వంతు నిధులను పూర్తిగా ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 430 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. రైలు పెట్టెలు కొనడానికి, ఇతర పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర వాటా ఇస్తే తప్ప రైళ్లు నడిపే పరిస్థితి లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌2ను రాయగిరి వరకూ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది.  ముందు అనుకున్న పనులే పూర్తి కావడం లేదంటే రాయగిరి వరకు ఎప్పుడు పూర్తవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Related Posts