YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

లోకాయుక్తగా జస్టిస్ చింతపంటి వెంకటరాములు

లోకాయుక్తగా జస్టిస్ చింతపంటి వెంకటరాములు

లోకాయుక్తగా జస్టిస్ చింతపంటి వెంకటరాములు
హైదరాబాద్ డిసెంబర్ 20 
 తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త, మానవ హక్కుల కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గురువారం రాత్రి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని అపెక్స్ కమిటీ సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను ఖరారుచేసింది. లోకాయుక్తగా జస్టిస్ చింతపంటి వెంకటరాములు, ఉప లోకాయుక్తగా రిటైర్డ్ జిల్లా జడ్జి వీ నిరంజన్‌రావు పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు సిఫారసుచేసింది. వాటిని గవర్నర్ ఆమోదిస్తూ సంబంధిత ఫైల్‌పై సంతకం చేయడంతో గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. ఈ అపెక్స్ కమిటీ సమావేశానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ, శాసనమండలిలో విపక్షనేతలు పాషాఖాద్రి, సయ్యద్ అమీన్ ఉల్‌హుస్సేన్ జాఫ్రీ హాజరయ్యారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అందుబాటులో లేకపోవడంతో ఆయన తరఫున ఆ పార్టీ ఉపనేత పాషాఖాద్రి హాజరయ్యారు.

Related Posts