YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 హింస, ఆస్తుల విధ్వంసానికి తాము వ్యతిరేకం: మాయావతి

 హింస, ఆస్తుల విధ్వంసానికి తాము వ్యతిరేకం: మాయావతి

 హింస, ఆస్తుల విధ్వంసానికి తాము వ్యతిరేకం: మాయావతి
లక్నో డిసెంబర్ 20 డిసెంబర్ 20 
పౌరసత్వ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) ఆ పార్టీ అధినేత్రి మాయావతి పునరుద్ఘాటించారు. అయితే, హింస, ఆస్తుల విధ్వంసానికి తాము వ్యతిరేకమని చెప్పారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆమె మాట్లాడుతూ, పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి సీఏఏని తాము వ్యతిరేకిస్తూనే వచ్చామని చెప్పారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టమని, దీనివల్ల ప్రజల్లో విభజన జరుగుతుందనే భయాందోళనలను తాము వ్యక్తం చేశామని తెలిపారు. అయితే ఇతర పార్టీల తరహాలో ప్రజా ఆస్తుల విధ్వంసం, హింస వంటి చర్యలపై తమ పార్టీకి ఎలాంటి నమ్మకం లేదని అన్నారు. కొత్త పౌరసత్వ బిల్లుపై బీఎస్‌పీ ఎంపీలు రాష్ట్రపతిని కూడా కలిసినట్టు చెప్పారు. ఈ చట్టంపై తమ వ్యతిరేకత కొనసాగుతూనే ఉంటుందని, ఇది పూర్తిగా తప్పుడు చట్టమని పేర్కొన్నారు. ఈ వివాదాస్పద చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం అమలంటూ జరిగితే సమీప భవిష్యత్తులో సమాజంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని మాయావతి అభిప్రాయపడ్డారు.

Related Posts