YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైలు ఢీకొని 13 ఆవులు మృతి

రైలు ఢీకొని 13 ఆవులు మృతి

రైలు ఢీకొని 13 ఆవులు మృతి
ఆగ్రా డిసెంబర్ 20  
ఉత్తరప్రదేశ్ లోని గోవల్ గ్రామం సమీపంలోని బర్హాన్ రైల్వేస్టేషను సమీపంలో రైలు పట్టాల పక్కన గడ్డి మేస్తున్న 13 ఆవులు గడ్డి మేస్తూ రైలు పట్టాల మీదకు వచ్చాయి. దీనితో సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి మరణించాయి. ఈ రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. 13 రైళ్లతోపాటు రెండు గూడ్సు రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. వేగంగా వచ్చిన సీల్దా రాజధాని ఎక్స్ ప్రెస్ ఆవుల మీద నుంచి పోవడంతో 13 ఆవులు అక్కడికక్కడే మరణించాయి.కాగా ‘‘నేను టిఫిన్ చేసేందుకు ఇంటికి వచ్చాను. అంతలో పెద్ద శబ్ధం వినిపించడంతో రైల్వేట్రాక్ వద్దకు తిరిగి వచ్చా...రైలు పట్టాలపై, రైలు ఇంజను వద్ద ఆవుల కళేబరాలు కనిపించాయి.’’ అని నాసిమ్ అనే పశువుల కాపరి చెప్పారు. ఫిరోజాబాద్, అలీఘడ్, ఆగ్రా, బులంద్ షహర్, హత్రాస్, గౌతంబుద్ధనగర్, కాన్పూర్, ఈటాహా, ఔరియా జిల్లాల్లో రైళ్ల కింద పడి 72 పశువులు మరణించాయి. దీనివల్ల 247 రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగింది. హౌరా-ఢిల్లీ, హౌరా -ముంబై మార్గాల్లో తరచూ పశువులు రైళ్ల కింద పడి మరణిస్తున్నందున రైలు మార్గం పక్కన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని రైల్వే అధికారి అజిత్ కుమార్ సింగ్ చెప్పారు.

Related Posts