బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కోసం కృషి చేయాలి: డీజీపీ
హైదరాబాద్ డిసెంబర్ 20
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కోసం ప్రతి ఓక్కరు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని డీజీపీ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. విధి లేని పరిస్థితుల్లో చిన్నారులు బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. అలాంటి చిన్నారులను రక్షించడం వృత్తిపరంగా ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. బాలకార్మిక వ్యవస్థ, అక్రమరవాణా చేసేవాళ్లను చట్టపరంగా శిక్షించాలని పేర్కొన్నారు. చిన్నారుల బాగోగులను పదేళ్లపాటు చూసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ఒక సామాజిక సేవ అన్నారు. పిల్లలను అక్రమ రవాణా చేసే వాళ్లు జనవరి, జూన్‌లో అప్రమత్తంగా ఉంటారు. ఈ రెండు నెలల్లో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ఉంటుందని జాగ్రత్తపడతారు. కావునా ఈ రెండు నెలలే కాకుండా ఏడాది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, తోపాటు పోలీసు ఉన్నతాధికారులు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోలీసు అధికారులు, అన్ని జిల్లాల మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.