YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆదరణ కరవు (విజయనగరం)

ఆదరణ కరవు (విజయనగరం)

ఆదరణ కరవు (విజయనగరం)
విజయనగరం, డిసెంబర్ 20 : జిల్లాలో ఆదరణ-2 పథకం కింద పరికరాల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల్లో కొందరికి నిరాశ ఎదురవనుంది. ఈ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో కొంత మందికే పరికరాలను అందజేశారు. కొత్త ప్రభుత్వం పథకాన్ని నిలిపి వేయడంతో రాయితీపై పరికరాలు పొందడానికి తమవంతు వాటా సొమ్ము (పది శాతం) చెల్లించిన కొందరికే అవి దక్కే పరిస్థితి నెలకొంది. మిగిలిన లబ్ధిదారులకు వాటా సొమ్మును తిరిగి చెల్లించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎవరికి ఎంత మొత్తం చెల్లించాలో పట్టణ, మండల స్థాయి అధికారులు సర్వే చేసి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. చేతివృత్తుల వారికి అవసరమైన పరికరాలు అందించేందుకు గత ప్రభుత్వం 2018 డిసెంబరులో ఆదరణ-2 పథకాన్ని ప్రారంభించింది. సెలూన్‌ కుర్చీలు, వాయిద్యానికి సంబంధించిన కీబోర్డులు తదితర 70 రకాల పరికరాలు అందజేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా 2018-19 ఏడాదికి జిల్లాలోని వివిధ వృత్తులకు చెందిన 26,750 మందికి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని విధించింది. మొత్తం 43,500లకు పైగానే దరఖాస్తులు చేసుకోగా పట్టణ, మండల స్థాయిలో ఉన్న కమిషనర్లు, ఎంపీడీవోలు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లాలో 31,354 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఎన్నికల ముందు 19,182 మందికి రూ.18.54 కోట్ల విలువ గల 24 వేల రకాలు పరికరాలను అందజేశారు. తర్వాత ఎన్నికల కోడ్‌ రావడంతో గోదాముల్లోనే 3,172 మందికి చెందిన పరికరాలు ఉండిపోయాయి. దీంతో నేటికి ఆవే అలానే ఉండిపోయాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక మిగిలిన వారికి కూడా పరికరాలను అందజేస్తామని చెప్పడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులు కూడా వాటి పంపిణీకి సన్నాహాలు చేశారు. ఇటీవల ఆదరణ పథకాన్ని నిలుపుదల చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న పరికరాలు పంపిణీ చేయాలా..? వద్ధా..? అన్న సందేహంలో అధికారులు ఉన్నారు. జిల్లాలో పది శాతం వాటా చెల్లించిన లబ్ధిదారులు సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూనిట్లు 3570 ఉన్నాయి. వీటిని అధికారుల లెక్కల ప్రకారం 3000 మందికి ఇవ్వవచ్చును. లబ్ధిదారుల్లో ఒక్కొకరు రెండు, మూడు రకాల యూనిట్లు దరఖాస్తు చేసుకున్నారు. నేటికి పరికరాలు రాక 9,000 మంది ఉన్నారు. వీరు గతంలో ఎంపిక చేసుకున్న యూనిట్లకు లబ్ధిదారుల వాటాగా 10 శాతం ప్రభుత్వానికి చెల్లించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు పరికరాలు ఎవరికి ఇవ్వాలి.. వాటా శాతం నిధులు ఎవరికి చెల్లించాలనే విషయమై తర్జనభర్జన పడుతున్నారు. కేత్రస్థాయిలో లబ్ధిదారులకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రస్తుతం మా వద్ద ఉన్న వివరాలు వారి వద్ద నుంచి వచ్చిన వాటితో సరి పోల్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. లబ్ధిదారులు చెల్లించిన 10 శాతం వాటా నిధులు తిరిగి వారి ఖాతాలకే ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చాయి.

Related Posts