YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

యంత్రాలెక్కడ..? (కర్నూలు)

యంత్రాలెక్కడ..? (కర్నూలు)

యంత్రాలెక్కడ..? (కర్నూలు)
కర్నూలు, డిసెంబర్ 20: వ్యవసాయంలో సాగు ఖర్చులను తగ్గించి మంచి దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో రాయితీపై యంత్రాలను ఏటా రైతులకు అందిస్తున్నారు. అలాంటి వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దశదిశ ప్రస్తుతం కరవయ్యాయి. ఖరీఫ్‌ పూర్తయి.. రబీ ఊపందుకున్నా ప్రభుత్వ విధివిధానాలు ఖరారు కాకపోవడం వేలాది మంది కర్షకులను అయోమయంలో పడేస్తోంది. వ్యవసాయ పనులకు ఉపయోగపడే పరికరాలు సకాలంలో ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా రైతులకు ఖరీఫ్‌ ప్రారంభంలోనే యంత్ర పరికరాలు ఇచ్చే కార్యక్రమం మొదలవుతోంది. సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌(ఎస్‌ఎంఏఎం) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది రూ.11.60 కోట్లు మంజూరు చేశాయి. ఈ పథకం కింద రైతులకు స్ప్రేయర్లు, గొర్రు, గుంటకలు, ట్రాక్టర్‌ ఆధారిత యంత్ర పరికరాలు, రోటావేటర్లు 50-70% రాయితీపై అందిస్తారు. దీనిలో కేంద్రం వాటా రూ.4.64 కోట్లు కాగా, మిగిలినవి రాష్ట్రం ఇస్తోంది. ఆర్‌కేవీవై(రాష్ట్రీయ కృషి వికాస యోజన) కింద కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.26.81 కోట్లు గతేడాది మంజూరు చేశాయి. దీనిలో కేంద్రం వాటా రూ.10.72 కోట్లు కాగా, రాష్ట్రం రూ.10 కోట్లు, మిగిలింది లబ్ధిదారుల వాటాగా నిర్ణయించారు. ఆర్‌కేవీవై కింద అద్దెకు యంత్ర పరికరాలు(కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌), వరికోత యంత్రాలు, వేరు శనగ నూర్పిడి యంత్రాలు, గోదాముల నిర్మాణం వంటి వాటికి రాయితీ కల్పిస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై నేటికీ విధివిధానాలు ఖరారు చేయలేదు. సాధారణంగా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే రైతులు తెలుసుకునేందుకు వ్యవసాయ పరికరాల ధరలు, కంపెనీ పేర్లు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ ఏడాది డిసెంబరు వచ్చినా ఆ ఊసేలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన ఏడు నెలల్లో కర్షకులకు సంబంధించి రెండే పథకాలు కసరత్తు జరుగుతున్నాయి. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం, పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పొలంబడి కార్యక్రమం ఖరీఫ్‌లో చేపట్టలేదు. రబీలో సైతం సగం పంట కాలం పూర్తయిన తర్వాత చేస్తున్నారు. 16 వారాల పాటు 399 పొలంబడులు నిర్వహించాలని, ఒక్కోదాని నిర్వహణకు రూ.30,000 నుంచి రూ.35,600 వరకు వెచ్చించడానికి నిర్ణయించారు. వివిధ పథకాల ద్వారా 18,318 మంది గతేడాది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వ లబ్ధి పొందారు. ఇలా జిల్లాకు రూ.60.60 కోట్లు ఖర్చు చేశారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన యాంత్రీకరణ వెబ్‌సైట్లో 7,141 మంది నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా దరఖాస్తుల చేసుకున్న జిల్లాల్లో కర్నూలు తృతీయ స్థానంలో ఉంది. యాంత్రీకరణ పరికరాలకు రైతులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. 

Related Posts