YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

బీమానా..! వద్దే  వద్దు... (నిజామాబాద్)

బీమానా..! వద్దే  వద్దు... (నిజామాబాద్)

బీమానా..! వద్దే  వద్దు... (నిజామాబాద్)
నిజామాబాద్, డిసెంబర్ 20 బీమా కంపెనీల తీరుతో పంటల బీమాపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. మూడున్నర దశాబ్దాల పాటు వివిధ పేర్లతో కొనసాగిన వ్యవసాయ బీమా పథకాల్లో కంపెనీలు రైతుల నుంచి ప్రీమియం కట్టించుకోవడంలో చూపిన ఉత్సాహం...పరిహారం చెల్లింపుల్లో చూపలేదు.రైతు సంఘాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత..ప్రీమియం రేట్లు, పథకం వర్తింపు విషయంలోనూ లోపాలను సరిచేసింది.తక్కువ ప్రీమియంతో ఎక్కువ పరిహారం అందేలా రైతులకు మేలు కలిగేలా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంబీఎస్‌వై)ని ప్రభుత్వం రూపొందించింది. ఖరీఫ్‌ సీజన్‌తో పోల్చితే రబీ ప్రీమియం తక్కువగా ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు అగ్రికల్చరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నారు. రైతు చెల్లించే ప్రీమియం పోగా మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం చెల్లించనున్నాయి. ఖరీఫ్‌లో ఆహార, నూనె గింజల పంటలన్నింటికీ రైతు వాటా కింద 2 శాతం చెల్లించాల్సి ఉండగా రబీలో 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. రబీలో పంటలకు విపత్తుల గండం వాటిల్లే ప్రమాదం ఎక్కువ ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు బీమాపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రబీలో ఎకరా వరికి ప్రభుత్వం రూ.34 వేలు బీమా మొత్తంగా నిర్ణయించింది. రైతు తన వాటాగా రూ.510 చెల్లించాలి. నారు పోసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు చోటుచేసుకొనే నష్టానికి పరిహారం చెల్లించనున్నారు. కొన్నేళ్లుగా యాసంగిలో కోతల సమయంలో వడగండ్ల వానలు, తుపానులతో ఎక్కువగా నష్టపోతున్నారు. అందువల్ల ఈ పంటకు ప్రీమియం చేసుకొంటేనే అన్నదాతలు అనుకోని విపత్తులతో నష్టపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. గతంతో పోల్చితే పీఎంబీఎస్‌వైలో రైతులకు అనుకూలంగా నిబంధనలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం..పిడుగుపాట్లు, గాలివాన, వడగండ్లు, తుపాన్లు, అనావృష్టి, వరదలు, నీట మునగడం తెగుళ్లతో నష్టం వాటిల్లితే పూర్తిపరిహారం చెల్లిస్తారు. ఏటా బ్యాంకుల్లో రుణాలు నవీకరణ చేసుకొనే సందర్భంలోనే మెజారిటీ రైతులు బీమా ప్రీమియం చెల్లించేవారు. రుణమాఫీ చేస్తానని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు రుణాల నవీకరణకు ముందుకు రాలేదు. ఖరీఫ్‌లో కేవలం 16వేల మంది రైతులు మాత్రమే పంటల బీమా ప్రీమియం చెల్లించారు.ప్రస్తుతం రబీ పంట సీజన్‌ ప్రారంభమైనప్పటికీ రైతులు ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం.
-----------------

Related Posts