మహిళల పట్ల వివక్షత విడనాడాలి మహిళలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి కాలేజీలో ర్యాగింగ్ కు పాల్ పడరాదు
సీనియర్ సివిల్ జడ్జి పి జె సుధా
నెల్లూరు డిసెంబర్ 20
మహిళల పట్ల పురుషులు వివక్షత విడనాడిన నాడే మహిళలు ధైర్యంగా సమాజంలో తిరగాలని, అటువంటి సమాజ స్థాపన కై ప్రజలందరూ కృషిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి పి జె సుధా పేర్కొన్నారు. స్థానిక రావు కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు మహిళలు బాలికలపై జరుగుతున్న అరాచక అకృత్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76వ సంతలో పూర్తి చేసుకున్నప్పటికీ మహిళలు స్వతంత్రంగా, ధైర్యంగా సమాజంలో తిరిగే పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చి తిరిగి ఇంటికి పోయే వరకు ఆ కుటుంబ సభ్యులు తరం కాదన్నారు. ఉన్నత విద్యకై కళాశాలలో విద్య అభ్యసించుట నూతనంగా చేరిన విద్యార్థులను, సీనియర్ విద్యార్థులు ఏదో ఒక రకంగా ర్యాగింగ్కు పాల్పడుతూ జూనియర్ లను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రతిరోజు వార్తాకథనాలను చూస్తూనే ఉన్నామని చెప్పారు. సమాజాభివృద్ధికి మహిళలు ఎంతో అవసరమని తెలిసినప్పటికీ మగ పిల్లలు కావాలనే దురుద్దేశంతో, మొగ్గలోనే తుం చేస్తున్న పరిస్థితి ఏదో ఒక ప్రదేశంలో జరుగుతూనే ఉందన్నారు. ఉందన్నారు. ఆడ మగ అనే తారతమ్యం లేకుండా సమంగా సమాజంలో చూడగలిగినరోజే సమాజం అభివృద్ధి వైపు ఫైన్ ఉంచగలరని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రావూస్ విద్యాసంస్థల చైర్మన్ కోటేశ్వరరావు, సీఈఓ శివారెడ్డి , ఏవో ప్రవీణ్ కుమార్, మీడియా ఇన్చార్జి ప్రదీప్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.