Highlights
- పరారీలో బోల్తా పడిన లారీ డ్రైవర్, క్లీనర్లు
విజయవాడలో శుక్రవారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీ కొట్టుకున్నాయి. పలువురికి గాయాలు కాగా ఓ లారీ డ్రైవర్, క్లినర్ పరారైయ్యారు. దీనితో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సమస్య నెలకొన్న సంబంధిత పోలీసులు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవరిస్తున్నారని పాలువురు వాహనదారులు మండిపడుతున్నారు. ఈ ఘటన భవానీ పురం ప్రాంతంలో గోల్లపూడి హైవేపై రామ నగర్, చర్చి సెంటర్ల వద్ద జరిగింది. ఈ సెంటర్ లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరగడం సర్వసాధారణం అయిపోయింది.గత కొంతకాలంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణుడి చావుకు వంద కారణాలు అన్న చందంగా సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం, అధికారులు పర్యవేక్షణ కొరవడడం, దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు జరుగుతుందడడంతో ట్రాఫిక్ ను మళ్లించారు. నిత్యం ప్రమాదాలకు కరణమవుతూ...సరైన సిగ్నల్ వ్యవస్థ లేక అటు పాదచారులు, ముఠా కూలీలు, సామాన్య ప్రజలు నరక యాతన పడుతుంటే స్పందించాల్సిన అధికారులు ఏమయ్యారో అర్ధంకావడం లేదని పలువురు బాటసారులు వాపోతున్నారు.
కాగా లారీల ఢీ కొట్టుకున్న ఘటనలో రెండో లారీ లోని డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి గాయాల పాలైనా తాను డ్రైవింగ్ చేయలేదని... ప్రక్కన కూర్చున్నానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రత్యక్ష సాక్షుల కధనం.